NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

ఇవాళ ఏపీలో ఇంటర్ ఫలితాలు.. ఉదయం 11 గంటలకు ఇంటర్ రిజల్ట్ రిలీజ్.. వాట్సాప్ గవర్నెన్స్‌లో కూడా ఇంటర్ ఫలితాలు విడుదల

నేడు తిరుపతిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. ఉదయం పది గంటలకు కచ్ఛపి ఆడిటోరియంలో “ఒకే దేశం – ఒకే ఎన్నిక” సెమినార్

తిరుమలలో ఇవాళ తుంభూర తీర్ద ముక్కోటి.. ఉదయం 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్న టీటీడీ

నేడు బెజవాడకు సీఎం చంద్రబాబు రాక.. మాజీ మంత్రి దేవినేని ఉమా కుమారుడి ఎంగేజ్‌మెంట్‌కు హాజరు కానున్న చంద్రబాబు

గుంటూరులో నేడు వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన.. పాల్గొననున్న సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

నేడు జూపాడు బంగ్లా మంతర్తూర్ శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు

నేడు రాయచోటి కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న జిల్లా స్థాయి సమీక్ష కమిటీ సమావేశం.. హాజరుకానున్న మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా స్థాయి అధికారులు

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేస్తారు.. అనంతరం 11 గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు

ఇవాళ్టి నుంచి మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు.. ఈరోజు నుండి ఈ నెల 29వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు

నేడు సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటన.. అకాల వర్షాలతో నష్టపోయిన పంటపొలాల పరిశీలన.. అనంతరం బీఆర్ఎస్ రజతోత్సవ సభపై సన్నాహక సమావేశంలో పాల్గొననున్న హరీష్ రావు

నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో హనుమాన్ శోభాయాత్ర.. భారీ బైక్ ర్యాలీ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు… మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు బంద్

ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్ కమాండ్​ కంట్రోల్​ సెంటర్​లో ఎక్సైజ్ విభాగం అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

ఐపీఎల్ 2025లో నేడు రెండు మ్యాచులు.. మధ్యాహ్నం 3.30కి లక్నో, గుజరాత్ మధ్య మ్యాచ్.. రాత్రి 7.30కి హైదరాబాద్, పంజాబ్ మధ్య మ్యాచ్