*నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన.. కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ ర్యాలీలో పాల్గొననున్న సీఎం రేవంత్.. ఉదయం 11 గంటలకు మెదక్ చేరుకోనున్న సీఎం.. రాందాస్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న ముఖ్యమంత్రి.
*ఏపీలో 19వ రోజు జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. ఉదయం 9 గంటలకు గోడిచర్ల నుంచి బస్సు యాత్ర ప్రారంభం.. నక్కపల్లి, పులవర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా అచ్యుతాపురం వరకు బస్సుయాత్ర.. భోజన విరామం తర్వాత నరిసింగపల్లి మీదుగా చింతపాలెంకు బస్సుయాత్ర.. మధ్యాహ్నం 3.30 గంటలకు చింతలపాలెంం దగ్గర సీఎం జగన్ బహిరంగ సభ.. రాత్రి చిన్నయపాలెంలో సీఎం జగన్ బస.
*నేడు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం.. గూడూరు, పొదలకూరు, సత్యవేడులో ప్రచారం.
*నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. నేడు పిఠాపురంలో పర్యటించనున్న పవన్.. రాజానగరం బహిరంగ సభలో పాల్గొననున్న పవన్.
*కాంగ్రెస్‌లోకి మరో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే.. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న రాజేంద్రనగర్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్.
*ఆదిలాబాద్ జిల్లా: నేడు ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. నివాళులర్పించడానికి రానున్న మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు తరలివస్తున్న ఆదివాసీలు
*గుంటూరు: నేడు గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రి విడదల రజిని.. విద్యానగర్ నుంచి గుంటూరు కార్పొరేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్న వైసీపీ శ్రేణులు.
*కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
*కేరళలో పర్యటించనున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,350.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.68,160.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రూ.89,900.
*ఐపీఎల్: నేడు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్.. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 గంటలకు జరగనున్న మ్యాచ్.