NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*నేడు సెక్రటేరియట్‌లో ప్రజావాణిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష.. నేడు సాయంత్రం ఇంటిగ్రెటెడ్ స్కూల్స్ ప్లాన్ డిజైన్‌పై సమీక్ష.. యాదాద్రి పవర్ స్టేషన్ పైనా సమీక్షించనున్న భట్టి విక్రమార్క

*తూర్పుగోదావరి జిల్లా: సాధారణ స్థాయికి తగ్గిన గోదావరి వరద.. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 8.5 అడుగులకు తగ్గిన గోదావరి వరద నీటిమట్టం.. బ్యారేజ్ నుంచి ఐదు లక్షల 60 వేల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల.. వ్యవసాయ అవసరాలకు గోదావరి డెల్టా పరిధిలోని మూడు కాలువలకు 9,200 క్యూసెక్కుల సాగునీరు విడుదల

*కర్నూలు: కౌతాళం మండలం ఉరుకుందు ఈరన్న స్వామి దేవస్థానంలో నేటి నుంచి శ్రావణమాసం ఉత్సవాలు ప్రారంభం.. నెల రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు.. సాయంత్రం ధ్వజరోహణతో ఉత్సవాలు ప్రారంభం.. శ్రావణమాసం అమావాస్య పురస్కరించుకుని నేడు స్వామి వారికి తులసి అర్చన, బిల్లర్చన, కనకాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం వంటి విశేష పూజలు.

*అన్నమయ్య జిల్లా : నేడు గాలివీడు మండల సర్వసభ్య సమావేశం… సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరుకానున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. గాలివీడు మండలంలోని వెలుగల్లు ప్రాజెక్టుకు గేట్లు ఎత్తి కాలువలకు నీరు విడుదల చేయనున్న మంత్రి.

*నిజామాబాద్ జిల్లా: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న ఇన్ ఫ్లో.. 18,696 క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1079.50 అడుగులు.. పూర్తిస్థాయి సామర్థ్యం 80టీఎంసీలు కాగా, ప్రస్తుతం 43.669టీఎంసీల నీరు నిల్వ.

*అనంతపురం : ఆల్ ఇండియా పుట్ బాల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమ్తెన జాతీయ స్థాయి బాలికల పుట్ బాల్ పోటీలు ప్రారంభం.

*IND vs SL 2nd ODI: నేడు ఇండియా, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే.. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం.