NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: సీఎం జగన్‌ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు నేడు విరామం.. గుడివాడలో జరగాల్సిన ‘మేమంతా సిద్ధం’ సభ రేపటికి వాయిదా.. గాయం కారణంగా విశ్రాంతి తీసుకోవాలంటూ జగన్‌కు వైద్యుల సూచన.. దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు.. రేపటి బస్సు యాత్రకు సెక్యూరిటీలో మార్పులు చేయాలని పోలీస్ శాఖ నిర్ణయం.

*సీఎం జగన్‌పై జరిగిన దాడిపై స్పందించిన ప్రధాని మోడీ.. జగన్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్.

*ఉమ్మడి విశాఖ జిల్లాలో చంద్రబాబు పర్యటన.. గాజువాక, పాయకరావు పేటలో ప్రజాగళం బహిరంగ సభలు.. షెడ్యూల్ తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రకు చంద్రబాబు.. ఎయిర్‌పోర్ట్ నుంచి గాజువాక వరకు భారీ బైక్ ర్యాలీ తీయనన్న టీడీపీ.

*నేడు తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. తెనాలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న పవన్.. తెనాలి ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. సాయంత్రం నాలుగు గంటలకు ,చెంచుపేట, సుల్తానాబాద్, మార్కెట్ ఏరియా ప్రాంతాల్లో పర్యటించనున్న పవన్ కళ్యాణ్.. మార్కెట్ ప్రాంతంలో బహిరంగ సభలో ప్రసంగించనున్న పవన్ కళ్యాణ్.

*అనంతపురం: జిల్లాలో రెండవ రోజు  బాలకృష్ణ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర బస్సు యాత్ర.. అనంతపురం, శింగనమల నియోజకవర్గాలలో కొనసాగనున్న యాత్ర.. గార్లదిన్నె మండలం కల్లూరులో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న బాలయ్య.

*నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం.. సముద్రంలో చేపల పునరుత్పత్తి సమయం కావడంతో రెండు నెలలు పాటు వేటనిషేధిస్తూ మార్గదర్శకాలు.. జిల్లాలో నాలుగు తీర ప్రాంత మండలాలు, 94 కిలోమీటర్ల తీర ప్రాంతం.. 58 మత్స్యకార ఆవాసాలు,195184 మత్స్యకారులు.. వేట ముగించుకుని ఒడ్డుకు చేరుకుంటున్న 4564 బోట్లు

*నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల పర్యటన.. కాంగ్రెస్ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొననున్న మంత్రులు.

*ఖమ్మం: నేడు వైరా నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం.. పాల్గొననున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

*ఢిల్లీ: ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ.. మేనిఫెస్టో విడుదల చేయనున్న ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్.. మోడీ గ్యారెంటీ 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో సంకల్పపత్ర మేనిఫెస్టో విడుదల చేయనున్న బీజేపీ.. అభివృద్ధి ,సంక్షేమ పథకాలు,దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, రైతులు, పేదల ప్రధాన అజెండాగా మేనిఫెస్టో రూపకల్పన చేసిన బీజేపీ.. బీజేపీ మేనిఫెస్టో రూపొందించిన రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో 27 మంది సభ్యుల మేనిఫెస్టో కమిటీ.. ప్రజల నుంచి 15 లక్షల సలహాలు సూచనలతో మేనిఫెస్టో రూపొందించిన బీజేపీ.. నమో యాప్ ద్వారా సంకల్ప పత్ర కోసం సలహాలు, సూచనలు చేసిన 4 లక్షలకు పైగా ప్రజలు.

Show comments