*విశాఖ: నేడు పెట్రోలియం యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ.. భవన నిర్మాణాలను వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. సబ్బవరం మండలం వంగలిలో నిర్మిస్తున్న ఐఐపీఈ శాశ్వత క్యాంపస్
*నేడు నెల్లూరులో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన.. చంద్రబాబు సభలో టీడీపీలో చేరనున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో పాటూ వైసీపీకి చెందిన పలువురు నేతలు.. వీపీఆర్ కన్వెన్షన్ హాలులో సభకు విస్తృతంగా ఏర్పాట్లు.. సభ అనంతరం పల్నాడు జిల్లాకు వెళ్లనున్న టీడీపీ అధినేత
*పల్నాడు: నేడు గురజాల నియోజకవర్గంలో రా.. కదలిరా బహిరంగ సభ.. సభకు హాజరుకానున్న చంద్రబాబు, పలువురు టీడీపీ సీనియర్ నేతలు.
*విజయనగరం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటన.. పట్రువాడలో కొత్తగా నిర్మించిన ఆర్ అండ్ బీ వంతెనను ప్రారంభించనున్న మంత్రి.. గంగచోళ్లపెంటలో రైతు భరోసా కేంద్రం, వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభోత్సవం.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న మంత్రి.
*నంద్యాల: నేడు శ్రీశైలంలో 2వరోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.. శ్రీస్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు.. సాయంత్రం శ్రీస్వామి అమ్మవారికి ద్వారక తిరుమల దేవస్థానంచే పట్టువస్త్రాలు సమర్పణ.. బృంగివహంపై ఆశీనులై పూజలందుకోనున్న ఆదిదంపతులు.. రాత్రి క్షేత్ర వీధుల్లో శ్రీస్వామి అమ్మవారికి గ్రామోత్సవం
*నేడు మధ్య ప్రదేశ్ చేరుకోనున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర
*జేఈఈ మెయిన్ దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు
*తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,170.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,910.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.76,300.
