*ఏలూరు: నేడు దెందులూరులో సీఎం జగన్ పర్యటన.. సిద్ధం సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి.. మధ్యాహ్నం 3.30 గంటలకు సభా ప్రాంగణానికి జగన్.
*తిరుమల: నేటి నుంచి 3 రోజుల పాటు హిందూ ధార్మిక సదస్సు.. హిందూ ధార్మిక సదస్సును నిర్వహించనున్న టీటీడీ.. హాజరుకానున్న 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు.
*శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురంలో పర్యటించనున్న రీజనల్ కోఆర్డినేటర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మున్సిపాలిటీ పరిధిలో వార్డుల వారీగా కార్యకర్తల సమావేశం.
*నేడు మధ్యాహ్నం 3 గంటలకు ధరణి కమిటీ సమావేశం.. ఇప్పటికే పలు సార్లు భేటీ అయిన ధరణి కమిటీ.. ఎండోమెంట్, వక్ఫ్ బోర్డ్, సర్వే అండ్ సెటిల్మెంట్ విభాగాలతో సమావేశం.. ధరణి వల్ల ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వ సబ్సిడీలు, ఆర్ధిక సహాయం కోల్పోయిన సన్నకారు రైతులకు మేలు చేకూర్చేలా ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇవ్వనున్న కమిటీ
*నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటన.. ఆందోల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాజనర్సింహ.
*నేడు భద్రాద్రి జిల్లాలో హరీష్‌రావు పర్యటన.. పినపాక, భద్రాచలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న హరీష్ రావు..
*నేడు ఒడిశా పర్యటనకు ప్రధాని మోడీ.. పలు ప్రాజెక్టులకు శ్రీకారం
*స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,600.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300.. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.78,000.
