1. విశాఖ : నేటితో 900రోజులకు చేరుకున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటం. సాయంత్రం 4గంటలకు కార్మిక సమాహార సభ నిర్వహిస్తున్న పోరాట కమిటీ.
2. నేడు విజయవాడకు పవన్ కల్యాణ్. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్న పవన్. మూడో విడత వారాహి యాత్ర రూట్ మ్యాప్, తేదీ ఖరారుపై చర్చ. మూడో విడత యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టాలా..? లేదా ఉత్తరాంధ్రలో చేపట్టాలా..? అనే అంశంపై చర్చించనున్న పవన్. మూడో తేదీ లేదా ఐదో తేదీన మూడో విడత వారాహి యాత్రపై చేపట్టే అవకాశం.
3. ప్రకాశం : ఒంగోలు కలెక్టరేట్ లో కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం.. ఒంగోలు లోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలిక గర్గ్ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం..
4. నేడు మహబూబ్ నగర్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటన. క్లాక్ టవర్ వద్ద సభ లో పాల్గొననున్న కిషన్ రెడ్డి. ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం, అసెంబ్లీ కోర్ కమిటీ సమావేశాల్లో పాల్గొననున్న కిషన్ రెడ్డి.
5. నేడు నిర్మల్ జిల్లాలో బీజేపీ నేత ఈటల రాజేందర్ పర్యటన. వరద ముంపు ప్రాంతాలతో పాటు కడెం ప్రాజెక్టు ను పరిశీలించనున్న ఈటల రాజేందర్. మధ్యాహ్నం మీడియా సమావేశం.
6. నేడు తెలంగాణలో మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.
7. అంబేద్కర్ కోనసీమ జిల్లా : నేడు జిల్లాలోని 8 మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 30 పాఠశాలకు సెలవు. పలుచోట్ల పాఠశాలల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు.
8. తూర్పుగోదావరి జిల్లా : ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద తగ్గుతున్న గోదావరి వరద ఉధృతి. బ్యారేజీ వద్ద 16 అడుగులు నుండి 15 పాయింట్ 6 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం. బ్యారేజీ నుండి 15 లక్షల 60 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక.
