Site icon NTV Telugu

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

*అమరావతి: ఇవాళ విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.. విజయనగరం మెడికల్‌ కాలేజ్‌ ప్రాంగణం నుంచి 5 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు వర్చువల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం

అమరావతి: నేటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్‌.. 5 దశల్లో కార్యక్రమం అమలు

*నేడు 6వ రోజుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్

*ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ.. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన కవిత.. తనపై ఎలాంటి బలవంతపు చర్యలూ ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరిన కవిత.. కవిత కేసు విచారించనున్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం

*ఆదిలాబాద్‌: ఉమ్మడి జిల్లాలో మరో రెండు వైద్య కళాశాలలు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్.. వర్చువల్‌గా నిర్మల్, కొమురం భీం జిల్లాల మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్న సీఎం.

*జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా కేంద్రంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను వర్చువల్‌గా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్

*హైదరాబాద్‌: నేడు రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ పరీక్ష.. పకడ్బందీగా ఏర్పాటు చేసిన అధికారులు.. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 ఎగ్జామ్‌.. 33 జిల్లాల్లో 2,052 ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు.. పేపర్‌- 1 కోసం 1,139 సెంటర్లు, పేపర్‌ -2 కోసం 913 సెంటర్ల ఏర్పాటు

*సంగారెడ్డి: నేటి నుంచి మూడు రోజుల పాటు ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో క్రీడోత్సవాలు.. క్రీడల్లో పాల్గొననున్న తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్టానికి చెందిన 1500 మంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు

*నేటితో శ్రీశైలంలో ముగియనున్న శ్రావణ మాసోత్సవాలు,శివసప్తాహ భజనలు

*ఆసియాకప్‌: నేడు బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న మ్యాచ్

Exit mobile version