Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు విజయవాడకు సినీనటుడు రజనీకాంత్‌. ఎన్నీఆర్‌ శతజయంతి ఉత్సవాలకు హాజరుకానున్న రజిని, చంద్రబాబు, బాలకృష్ణ.

2. నేడు స్పందనపై సీఎం జగన్‌ సమీక్ష. కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌.

3. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో చార్జ్‌షీట్‌ దాఖలు. మూడో అడిషనల్‌ చార్జిషీట్‌ దాఖలు చేసిన ఈడీ. అరున్‌ పిళ్లై, అమన్‌సింగ్‌పై ఈడీ అభియోగాలు. లిక్కర్‌స్కామ్‌లో అక్రమాలు, మనీలాండరింగ్‌పై అభియోగాలు మోపిన ఈడీ అధికారులు. ఈడీ చార్జిషీట్‌ను పరిగణలోకి తీసుకోవడంపై నేడు విచారణ జరుపనున్న ప్రత్యేక కోర్టు.

4. నేడు ఒంటిమిట్టకు ఏపీ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌. కోదండ రామాలయాన్ని సందర్శించనున్న గవర్నర్‌. సాయంత్రం 5.30 గంటలకు అమీన్‌పీర్‌ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు.

5. నేడు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై విచారణ. మధ్యాహ్నం 3.30 గంటలకు విచారించనున్న తెలంగాణ హైకోర్టు.

6. నేడు నల్లొండలో కాంగ్రెస్‌ నిరుద్యోగ నిరసన దీక్ష. పాల్గొననున్న రేవంత్‌, ఎంపీ కోమటిరెడ్డి, ఉత్తమ్‌. మర్రిగూడ నుంచి క్లాక్‌టవర్‌ వరకు భారీ ర్యాలీ. సాయంత్రం క్లాక్‌ టవర్‌ దగ్గర కార్నర్‌ మీటింగ్‌.

7. నేడు ఏపీ ఉద్యోగ సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం. ఉదయం 11 గంటలకు ఏపీ జేఏసీ అమరావతి కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు, ట్రేడ్‌ యూనియన్ల రౌండ్‌టేబుల్ భేటీ.

8. నేడు, రేపు ఏపీకివర్ష సూచన. కోస్తా, సీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం. తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వానలు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం.

9. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,040 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,950 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,200లుగా ఉంది.

10. ఐపీఎల్‌లో నేడు పంజాబ్‌ వర్సెస్‌ లక్నో. మొహాలీ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌.

11. లిక్కర్‌స్కామ్‌లో సిసోడియా బెయిల్‌పై నేడు తీర్పు. ఈరోజు తీర్పు వెల్లడించనున్న రౌస్‌ అవెన్యూ కోర్టు.

12. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో నేడు హైకోర్టు తీర్పు. కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్‌. నేడు తీర్పు వెల్లడించనున్న తెలంగాణ హైకోర్టు.

13. నేడు ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్లను ప్రారంభించున్న మోడీ. దేశవ్యాప్తంగా 91 ఆకాశవాణి ట్రాన్స్‌మీటర్లు ప్రారంభం. వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ.

Exit mobile version