NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న రామోజీ గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

నేడు టీ-20 వరల్డ్‌ కప్‌లో భారత్-ఇంగ్లాండ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

నేడు ఏపీ ప్రభుత్వానికి రిపోర్డ్‌ చేయనున్న సీనియర్‌ IAS అధికారి పీయూష్‌ కుమార్‌. పీయూష్‌ను ప్రిన్సిపల్ ఫైనాన్స్‌ సెక్రటరీగా నియమించనున్న చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటివరకు కేంద్ర వాణిజ్యశాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన పీయూష్‌.

నేడు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుపై నాంపల్లి కోర్టు విచారణ. నిన్న వాదనలు విన్న నాంపల్లి కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ఛార్జ్‌షీట్‌ వేయకపోవడంతో డీఫాల్ట్‌ బెయిల్‌ ఇవ్వాలని మాజీ అడిషనల్‌ ఎస్పీలు కోరగా.. జూన్‌ 10నే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశామని పీపీ కోర్టు స్పష్టం చేశారు. కొన్ని కారణాలతో ఛార్జ్‌షీట్‌ను వెనక్కి పంపారని పీపీ వాదించారు. ఈ నేపథ్యంలో నేడు తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్టు.

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

అన్నమయ్య జిల్లాలో నేడు రాయచోటి పట్టణంలో పర్యటించనున్న రాష్ట్ర రవాణా,యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి… రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ ను సందర్శించనున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి…

ఇటీవల మృతి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య కుటుంబాన్ని, మాతృ వియోగం చెందిన ఎమ్మెల్యే పాయం వేంకటేశ్వర్లు ను పరామర్శించేందుకు నేడు మణుగూరులో పర్యటించనున్న ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క.