NTV Telugu Site icon

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు విశాఖ జిల్లాలో పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ పర్యటన. పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీలో 20 మంది ఎంపీల బృందం.

2. నేడు బెంగళూరు ఇస్రో సెంటర్‌కు ప్రధాని మోడీ. గ్రీస్‌ నుంచి బెంగళూరు చేరుకోనున్న ప్రధాని మోడీ. చంద్రయాన్‌-3 బృందంతో మాట్లాడనున్న ప్రధాని. ఆదిత్య 111 మిషన్‌, గగన్‌యాన్‌పై ప్రధాన చర్చ.

3. నేడు హైదరాబాద్‌కు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. సాయత్రం 5.30 గంటలకు చేవెళ్ల ప్రజాగర్జన సభ, పొల్గొననున్న ఖర్గే.

4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,450 లుగా ఉండగా.. 22 క్యా్రెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.76,400 లుగా ఉంది.

5. నేడు రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో సీఎం కేసీఆర్‌ పర్యటన. ట్రెక్‌ఫారెస్ట్‌ పార్క్‌లో కోటి మొక్కలు కార్యక్రమంలో. మొక్కను నాటి ప్రారంభించనున్న సీఎం కేసీఆర్‌.

6. నేడు వారాణాసిలో సాంస్కృతిక మంత్రుల భేటీ. కల్చరల్‌ డిక్లరేషన్‌ అంశాలపై సమావేశంలో చర్చ.

7. తెలంగాణ కాంగ్రెస్‌లో ముగిసిన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ. నేటి నుంచి దరఖాస్తులు పరిశీలించనున్న కమిటీ. ఎనిమిది రోజుల్లో వెయ్యికిపైగా మంది దరఖాస్తు. అత్యధికంగా ఇల్లందు స్థానంలో 38 దరఖాస్తులు. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురిని ఎంపిక చేసి లిస్ట్‌ను ఏఐసీసీకి పంపించనున్న స్ర్కీనింగ్‌ కమిటీ. టికెట్‌ కోసం దరఖాస్తు చేయని ఐదుగురు నేతలు. జానారెడ్డి, రేణుకాచౌదరి, నాగం, గీతారెడ్డి, వీహెచ్‌.