NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమన్నాయంటే?

Whats Today

Whats Today

నేడు కన్నెపల్లి, మేడిగడ్డ బ్యారేజ్‌లు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పరిశీలన. ఉదయం 9.30 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ సందర్శన. ఉదయం 10.30 గంటలకు మేడిగడ్డ ప్రాజెక్ట్‌ను పరిశీలించనున్న నేతలు. నేడు మధ్యాహ్న ఒంటిగంటకు BRS ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ప్రెస్‌మీట్‌.

కాకినాడలో నేడు అన్నవరం రానున్న టీటీడీ సాంకేతిక బృందం. విమాన గోపురానికి బంగారం తాపడం చేయించేందుకు అంచనాలు వేయనున్న బృందం. దేవాదాయ శాఖకు నివేదిక అందించనున్న టీటీడీ బృందం.

తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,180 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,990 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.88,900 లుగా ఉంది.

హైదరాబాద్‌లో నేడు జీవో 317పై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం. జీవో 317 సమస్యల పరిష్కారంపై చర్చ.

నేడు సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. రేపు నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు. నిర్మలా సీతారామన్‌తో భేటీకానున్న సీఎం చంద్రబాబు. ఏపీకి కేటాయింపులపై కృతజ్ఞతలు తెలపనున్న సీఎం. పలువురు కేంద్రమంత్రులను కలవనున్న చంద్రబాబు.

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు సీఎం రేవంత్‌ సమీక్ష. హాజరుకానున్న మంత్రి సీతక్క ఉన్నతాధికారులు.

నేడు ఢిల్లీలో కార్గిల్‌ విజయ్‌ దివస్‌. కార్గిల్‌లోని యుద్ధవీరక స్మారకం దగ్గర నివాళులర్పించనున్న ప్రధాని మోడీ.

నేడు విశాఖ బీచ్‌రోడ్‌లో కార్గిల్‌ విజయ్‌ దివస్‌. ఉదయం 7.30 గంటలకు నేవీ ఆధ్వర్యంలో కార్యక్రమం.

నేడు ఏపీకి భారీ వర్షసూచన. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. గంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్‌, కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.

నేడు మహిళల ఆసియకప్‌ టోర్నీలో సెమీస్‌ పోరు. మధ్యాహ్నం 2 గంటలకు బంగ్లాదేశ్‌తో భారత్‌ ఢీ. హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న హర్మన్‌ప్రీత్‌ సేన.

నేడు చివరిరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రశ్నోత్తరాల అనంతరం టిడ్కో గృహాల అంశంపై లఘు చర్చ. ఆర్థిక పరిస్థితిపై నేడు ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం. సభలో శ్వేతపత్రం విడుదల చేయనున్న చంద్రబాబు.

Show comments