NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్‌ డిపార్ట్‌మెంట్. తెలంగణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే.

నేడు నాంపల్లి కోర్టులో తిరుపతన్న, భుజంగరావు బెయిల్‌ పిటషన్లపై విచారణ. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బెయిల్‌ కోరుతూ తిరుపతన్న, భుజంగరావు పిటిషన్స్‌.

నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66, 250 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.95,500 లుగా ఉంది.

నేడు కుప్పంలో రెండోరోజు సీఎం చంద్రబాబు పర్యటన. ఉదయం 10.30 గంటలకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరణ. మధ్యాహ్నం 2.40 గంటలకు పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు భేటీ. సాయంత్రం 4గంటకు బెంగళూరు మీదుగా విజయవాడకు చంద్రబాబు పయనం.

నేడు కేజ్రీవాల్‌ను ట్రయల్‌ కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ. లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు. మార్చి 21న లిక్కర్‌ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసిన ఈడీ. ప్రస్తుతం తీహార్‌ జైల్లో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న కేజ్రీవాల్‌.

నేడు ఢిల్లీలో ఉదయం 11 గంటలకు లోక్‌ సభ స్పీకర్‌ ఎన్నిక. ఎన్డీఏ లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్థిగా ఓం బిర్లా. ఇండియా కూటమి స్పీకర్‌ అభ్యర్థిగా కె.సురేష్‌. దేశ చరిత్రలో తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక.

లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికతో పార్టీ ఎంపీలకు టీడీపీ విప్‌ జారీ. 16 మంది లోక్‌సభ సభ్యులకు త్రీలైన్‌ విప్‌ జారీ చేసిన టీడీపీ. ఉదయం 9.30 గంటలకు లావు శ్రీకృష్ణదేవరాయలు అధ్యక్షతన టీడీపీ ఎంపీల భేటీ. ఓటింగ్‌ విధానంపై ఎంపీలకు అవగాహన కల్పించనున్న టీడీపీపీ. సమావేశం తర్వాత పార్లమెంట్‌కు టీడీపీ ఎంపీలు. ఏపీ బీజేపీ, జనసేన ఎంపీలను కూడా సమావేశానికి ఆహ్వానించిన టీడీపీ.

నేడు తెలంగాణలో పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు. ప్రైవేటు స్కూల్స్‌లో ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆరోపణ. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాలని విద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌.