*నేడు జిల్లాలోని కూనవరం వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి పర్యటన రద్దు.. వచ్చే సోమ, మంగళవారాల్లో వరద ప్రాంతాల్లో పర్యటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి.. బాధితులకు అన్ని రకాల సహాయ చర్యలు తీసుకుని ఆదుకోవాలని సీఎం ఆదేశం
*రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 10 గంటలకు సభ ప్రారంభం.. తొలుత ప్రశ్నోత్తరాలు.. 8 బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్న ప్రభుత్వం.. చనిపోయిన ఐదుగురు మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం.. ఇవాళ రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ.. అకాల వర్షాలు, రాష్ట్రంలో వైద్య విద్య బలోపేతంపై చర్చ
*నేడు సీఎం జగన్ విజయవాడ పర్యటన
*అనంతపురం : నేటి నుంచి రెండు రోజుల పాటు జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలను పరిశీలించనున్న నాక్ బృందం సభ్యులు.
*తిరుమల: ఇవాళ డయల్ యూవర్ ఈవో కార్యక్రమం
*నేడు శ్రీశైలంలో అమ్మవారి ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ, ప్రత్యేక పూజలు
*నేడు మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో తమిళనాడు చెందిన భక్తులు నేడు “ఏక్ ధిన్ రామనామ, కోటి యజ్ఞం జపమాల కార్యక్రమం.
*నేడు మంగళగిరి కోర్టుకు హాజరుకానున్న నారా లోకేష్.. తనపై, తన కుటుంబంపై అధికార పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేసారన్న లోకేష్ ఆరోపణలపై కోర్టులో విచారణ.. ఈరోజు వాదనలు విననున్న మంగళగిరి కోర్టు.
*తెలంగాణ: తొలి విడత కౌన్సెలింగ్‌కు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల.. ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లకు నేటి నుంచి వెబ్‌ఆప్షన్లు
