Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు విడుదల. సెప్టెంబర్‌ నెల టోకెన్లు విడుదల చేయనున్న టీటీడీ.

2. నైరుత ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు. తెలంగాణకు ఎల్లో అలర్ట్‌ జారీ. తెలంగాణలో ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన. ములుగు, భద్రాద్రి కొత్తగూడె, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. ఏపీలోనూ పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు.

3. తెలంగాణలో రెండోరోజు సీఈసీ ప్రతినిధుల పర్యటన. నేడు కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ ప్రతినిధుల సమీక్ష.

4. నేడు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభం. ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్న సీఎం జగన్‌. నెలరోజల పాటు జరుగనున్న కార్యక్రమం. నేటి నుంచి పార్టీ నేతలు, గృహ సారథులకు శిక్షణ. వచ్చే నెల 1 నుంచి ఇంటింటికీ తిరగనున్న కేడర్‌.

5. నేడు ఏపీ టెన్త్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్న విద్యాశాఖ.

6. నేడు పాట్నాలో నితీశ్‌ అధ్యక్షతన విపక్షాల తొలి భేటీ. హాజరుకానున్న రాహుల్‌, మమత, కేజ్రీవాల్‌, పవార్‌.

7. నేడు నల్గొండ జిల్లా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర 100వ రోజు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో కొనసాగనుంది. కేతేపల్లి నుండి చీకటి గూడెం, ఉప్పల్ పహాడ్, భాగ్యనగరం, కొప్పోలు గ్రామాల్లో పాదయాత్ర కొనసాగనుంది. ఉప్పల్ పహాడ్ గ్రామంలో లంచ్ బ్రేక్.. పాదయాత్ర బృందం రాత్రికి కొప్పోలు గ్రామంలో బస చేస్తారు.

8. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..

9. ఇవాళ పదో రోజు వారాహి యాత్ర. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ సత్యనారాయణ గార్డెన్స్ లో బస చేసిన పవన్ కళ్యాణ్. ఉదయం 10 గంటలకు ముఖ్య నేతలతో భేటీ. ఉదయం 11 గంటలకు ఫీల్డ్ విజిట్ నిర్వహించనున్న జనసేనాని. సాయంత్రం 5 గంటలకు పి.గన్నవరం నుండి రాజోలు మీదుగా దిండి రిసార్ట్స్ వరకు పవన్ కళ్యాణ్ వారాహియాత్ర రోడ్డు షో. రాత్రికి దిండి రిసార్ట్స్ లో బస.

Exit mobile version