NTV Telugu Site icon

Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు మెదక్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటన. రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు మెదక్‌కు గవర్నర్‌. మెదక్‌ కెథెడ్రల్‌ చర్చి వందేళ్ల వేడుకలో పాల్గొననున్న జిష్ణుదేవ్‌ వర్మ. అనంతరం కొల్చారంలోని గురుకుల విద్యార్థులతో గవర్నర్‌ ముఖాముఖి. విద్యార్థినులతో కలిసి లంచ్‌ చేసి ఆహారాన్ని పరిశీలించనున్న గవర్నర్‌. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్న గవర్నర్‌.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.78,500 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,690 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,400 లుగా ఉంది.

తెలంగాణలో కొనసాగుతున్న చలి. ఆదిలాబాద్‌లో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత. మెదక్‌లో 16.8, పటాన్‌చెరులో 17.2 డిగ్రీలు, నల్గొండలో 18.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.

ఇంద్రకీలాద్రిపై రెండోరోజు భవానీ దీక్ష విరమణలు. భవానీ నామస్మరణతో మార్మోగుతున్న ఇంద్రకీలాద్రి. తెల్లవారుజామున 3 గంటల నుంచి కొనసాగుతున్న దర్శనాలు.

నిజామాబాద్‌ జిల్లాలో నేడు మంత్రి జూపల్లి పర్యటన. వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించనున్న మంత్రి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన.

శబరిమలలో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు. 25, 26న పరిమితంగా వర్చువల్‌, స్పాట్‌ బుకింగ్స్‌. 25న 50 వేలు, 26న 60 వేల మంది భక్తులకు దర్శనం. స్పాట్‌ బుకింగ్‌ ద్వారా 5 వేల మందికి మాత్రమే దర్శనం.

కడ్తాల్‌లో పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం. రెండో రోజు కొనసాగుతున్న మహాయజ్ఞం. కొనసాగుతున్న 225 గంటల అఖండ మహాధ్యానం.

కువైట్‌లో రెండో రోజు ప్రధాని మోదీ పర్యటన. రక్షణ, వాణిజ్యంతో పాటు కీలక రంగాల్లో ఒప్పందాలు.

మహిళల క్రికెట్‌: నేడు భారత్‌-విండీస్‌ తొలి వన్డే. మధ్యాహ్నం 1.30 గంటలకు వడోదర వేదికగా మ్యాచ్‌.

తిరుమలల పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం. 14 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 72,411 మంది భక్తులు.

 

Show comments