Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు మధురైలో మురుగన్‌ భక్త సమ్మేళనం. పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌. సుబ్రహ్మణ్యస్వామి భక్తులతో నిర్వహించనున్న భక్త సమ్మేళనం.

తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,750 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,350 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,20,000 లుగా ఉంది.

నేడు హైదరాబాద్‌కు ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌. మధ్యాహ్నం గాంధీభవన్‌లో పంచాయతీరాజ్‌ రాష్ట్రకార్యవర్గ సమావేశం. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఇంచార్జ్‌ మీనాక్షి నటరాజన్‌. మీనాక్షిని కలవనున్న వరంగల్‌ జిల్లా నాయకులు. మంత్రి కొండా సురేఖ, కొండా మురళిపై ఫిర్యాదు చేయనున్న నాయకులు.

డిప్యూటీ సీఎం భల్లి విక్రమార్క షెడ్యూల్‌.. ఉదయం 11 గంటలకు సచివాలయంలో భట్టి అధ్యక్షతన కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ. మౌలిక సదుపాయాల కల్పనపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం. ఇవాళ రాత్రి దుబాయ్‌ వెళ్లనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

ఖమ్మం: నేడు ఎదులాపురం మున్సిపాలిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.

నంద్యాల : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ ఫ్లో : 60,587 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో : నిల్. పూర్తి స్థాయి నీటిమట్టం : 885 అడుగులు. ప్రస్తుతం : 854.20 అడుగులు. పూర్తి స్దాయి నీటి నిల్వ : 215.7080 టీఎంసీలు. ప్రస్తుతం : 89.7132 టీఎంసీలు. కుడి,ఎడమ విద్యుత్ కేంద్రాలలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి.

 

Exit mobile version