Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

నేడు ఏపీ హైకోర్టులో పీఎస్సార్‌ బెయిల్‌ పిటిషన్ల విచారణ. నటి జత్వాని కేసు, ఏపీపీఎస్సీ అక్రమాల కేసుల్లో బెయిల్ కోరుతూ పిటిషన్‌. రెండు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరపనున్న ఏపీ హైకోర్టు.

అంబేద్కర్ కోనసీమ: నేడు అమలాపురంలో పర్యటించనున్న జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. మధ్యాహ్నం అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం.. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా టీడీపీ మిని మహానాడుకు హాజరుకానున్న మంత్రి అచ్చెన్నాయుడు.

అమరావతి: మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో ఈ-బస్‌ లపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఈ-బస్ ల పనితీరు, ఏపీ అవసరాలకు తగ్గట్టు ఎన్ని బస్సులు ఉండాలి, ఇతర అంశాలపై సీఎం సమీక్ష.

విజయవాడ: నేడు వల్లభనేని వంశీ కేసులు విచారణ. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై నేడు తీర్పు ఇవ్వనున్న నూజివీడు కోర్టు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ ఇవ్వాలని వంశీ పిటిషన్ పై ఇవాళ తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం. అక్రమ మైనింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో వంశీ పిటిషన్. ఈ పిటిషన్ పై నేడు విచారణ చేయనున్న హైకోర్టు. మైనింగ్ కేసులో పిటీ వారెంట్ ఇవాళ వరకు అమలు చేయబోమని హైకోర్టుకి తెలిపిన ప్రభుత్వం.

కరీంనగర్: నేడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ. వైశ్య భవన్ నుంచి సాయంత్రం ప్రారంభం కానున్న యాత్ర. నగరంలో ట్రాఫిక్ మల్లింపు చేసిన పోలీసులు. 50 వేల మంది ర్యాలీకి వస్తారని ప్రకటించిన బీజేపీ నేతలు.

నేడు కరీంనగర్, వరంగల్‌ రైల్వేస్టేషన్లను వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ. ప్రారంభోత్సవంలో పాల్గొననున్న కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 26 కోట్లతో స్టేషన్ అభివృద్ధి.

నేడు ఉదయం 11 గంటలకు సీఎస్ రామకృష్ణరావు అధ్యక్షతన అన్ని శాఖల ఉన్నతాధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ పై చర్చ.

నేడు రాజస్తాన్ కు ప్రధాని నరేంద్రమోడీ. బికనీర్‌లోని దేశ్‌నోక్‌లో 26,000 కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం, జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి. రైల్వేలు, రోడ్డు మార్గాలు, విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన రంగాల ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని. దేశంలోని 18 రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలలోని 86 జిల్లాల్లో పునరాభివృద్ధి చెందిన 103 అమృత్ స్టేషన్లను ప్రారంభించనున్న ప్రధాని.

అమరావతి: ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. 3 రోజులపాటు కొనసాగనన్న ఢిల్లీ టూర్. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తోపాటు మరికొందరు మంత్రులతో సమావేశం.. ఏపీలో పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతో భేటీకానున్న సీఎం చంద్రబాబు.. ఈనెల 24న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

తిరుమల: నేడు జపాలి హనుమజ్జయంతి ఉత్సవాలు.. పాపవినాశనం మార్గంలో ఆంక్షలు.. ప్రైవేట్ వాహనాలపై పాపవినాశనం మార్గంలో నిషేధం.. ఆర్టీసీ బస్సుల ద్వారానే భక్తులను అనుమతించనున్న టీటీడీ

Exit mobile version