Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు ఏపీలో నేతన్న నేస్తం నిధుల విడుదల. 80,686 మంది అకౌంట్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్‌. రూ.24వేల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్న సీఎం జగన్‌. వెంకటగిరిలో నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్‌.

2. బంగాళాఖాతంలో అల్పపీడనం. మూడు రోజుల్లో బలహీనపడనున్న అల్పపీడనం. ఏపీకి మరో రెండు రోజులు వర్ష సూచన. కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం. ఈ నెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక.

3. నిర్మల్‌ స్వర్ణ ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద. మూడు గేట్లు ఎత్తి 15వేల క్యూసెక్కుల నీరు విడుదల. స్వర్ణ ప్రాజెక్ట్‌ ఇన్‌ఫ్లో 36వేల క్యూసెక్కులు. పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 1175.5 అడుగులు. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద నీరు.

4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,750 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.82,400 లుగా ఉంది.

5. జీహెచ్‌ఎంసీ పరిధిలో నేడు, రేపు సెలవులు. విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు. అత్యవసర సేవలు కొనసాగుతాయన్న ప్రభుత్వం.

6. సుప్రీంకోర్టులో నేడు రాహుల్‌ పిటిషన్‌పై విచారణ. పరువునష్టం కేసులో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన రాహుల్‌ గాంధీ.

7. నేడు ఎమర్జింగ్‌ ఆసియాకప్‌ సెమీస్. మధ్యాహ్నం 2గంటలకు భారత్‌ వర్సెస్‌ బంగ్లాదేశ్‌.

8. నేడు మోడీతో శ్రీలంక అధ్యక్షుడి సమావేశం. ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చించనున్న విక్రమసింఘే.

9. నేడు తెలంగాణ బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న కిషన్‌ రెడ్డి. ఉదయం 11.45కి పార్టీ ఆఫీసులో బాధ్యతల స్వీకరణ. ఉదయం 7.30 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు.

10. నేటి నుంచి విశాఖలో నెలరోజులపాటు ఇంటింటి ఓటర్‌ సర్వే. ఓటర్ల జాబితాలో కొత్తగా సవరణలపై వివరాలు సేకరించనున్న బీఎల్‌వోలు.

Exit mobile version