NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

తిరుమలలో సీఎం చంద్రబాబు, కుటుంబ సభ్యులు. నేడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకోనున్న సీఎం చంద్రబాబు. చంద్రబాబు మనవడు దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేయనున్న చంద్రబాబు కుటుంబం.

తిరుమల: నేడు జూన్ నెల శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల.. ఆన్‌లైన్‌లో శ్రీవారి దర్శన టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ.. ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవ టికెట్స్, 11 గంటలకు జేష్ఠాభిషేకం టికెట్స్ విడుదల.. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్స్ విడుదల చేయనున్న టీటీడీ

అమరావతి: నేడు ఉద్యోగుల బకాయిల చెల్లింపులు.. ఈరోజు రూ.6,200 కోట్లు విడుదల చేయనున్న ఏపీ ఆర్ధిక శాఖ.. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ బకాయిలు చెల్లించనున్న ప్రభుత్వం

నేడు టీడీపీ బృందం విశాఖ కలెక్టర్‌ను కలిసే ఛాన్స్‌. అవిశ్వాసానికి కౌన్సిల్‌ను సమావేశపర్చాలని లేఖ సమర్పించే అవకాశం. త్వరలో మరో ఐదుగురు జనసేనలో చేరే అవకాశం. గ్రేటర్‌ విశాఖలో మారుతున్న కూటమి, వైసీపీ బలాలు.

తెలంగాణలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు టెన్త్‌ ఎగ్జామ్స్‌. రాష్ట్రవ్యాప్తంగా 2.650 పరీక్ష కేంద్రాలు. టెన్త్‌ పరీక్ష రాయనున్న 5,09,403 మంది విద్యార్థులు. తెలంగాణ టెన్త్‌ ఎగ్జామ్‌లో తొలిసారి 24 పేజీల బుక్‌లెట్‌. ఎలాంటి అడిషనల్‌ పేజీలు ఇవ్వబోమన్న అధికారులు.

ఉదయం 11 గంటలకు విశాఖ సిటీ మాస్టర్‌ ప్లాన్‌ భూ సమస్యలపై మంత్రి నారాయణ సమీక్ష. ఏపీ సచివాలయంలో విశాఖ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశం. విశాఖ మాస్టర్‌ప్లాన్‌, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, హైవేకు రోడ్ కనెక్టివిటీ, మెట్రో కారిడార్‌, ఇతర అంశాలపై చర్చ.

విజయవాడ: వంశీ బెయిల్‌ పిటిషన్‌పై నేడు ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు. సత్యవర్థన్‌ కిడ్నాప్‌ కేసులో బెయిల్‌ కోరుతూ వంశీ పిటిషన్‌.

తిరుపతి తొక్కిసలాట ఘటనపై కమిషన్‌ విచారణ. నేడు విచారణకు హాజరుకానున్న అప్పటి టీటీడీ సీవీఎస్‌వో శ్రీధర్‌. సీవీఎస్‌వోతో సహా విచారణకు డీఎస్సీ రమణ, కానిస్టేబుల్, హోంగార్డులు.

విశాఖ: నేడు GVMC స్థాయి సంఘం సమావేశం. 104 అంశాలతో మేయర్‌ హరి వెంకటకుమారి అధ్యక్షతన సమావేశం.

బడ్జెట్‌పై నేడు తెలంగాణ అసెంబ్లీలో సాధరణ చర్చ. చర్చకు సమాధానం ఇవ్వనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.