నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర. సాయంత్రం అచ్చంపేట జంక్షన్‌లో బహిరంగ సభ. బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం జగన్.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,790 లుగా ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.89,900 లుగా ఉంది.
నేటి నుంచి 24 వరకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన. ఉదయం మహబూబ్‌నగర్‌లోని వంశీచందర్‌రెడ్డి నామినేషన్‌కు రేవంత్. సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభకు హాజరుకానున్న రేవంత్.
నేడు ఐపీఎల్‌లో లక్నోతో తలపడనున్న చెన్నై. లక్నో వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్.
నేడు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి పురందేశ్వరి నామినేషన్ దాఖలు. మధ్యాహ్నం బొమ్మూరు కలెక్టరేట్‌లో నామినేషన్ వేయనున్న పురందేశ్వరి.
పశ్చిమగోదావరి జిల్లాలో నేడు నామినేషన్ దాఖలు చేయనున్న మంత్రులు. గోపాలపురంలో హోంమంత్రి తానేటి వనిత నామినేషన్. తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వర రావు నామినేషన్. భీమవరంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, దెందులూరులో ఎమ్మెల్యే అబ్బాయచౌదరి నామినేషన్లు.
జగన్‌పై దాడి కేసులో కీలకంగా ఏ2 పాత్ర. పోలీసులు అదుపులోనే ఉన్న దుర్గారావు. నేడు ఏ2 దుర్గారావును అరెస్ట్ చూపించే అవకాశం.
నేడు నామినేషన్ వేయనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. నామినేషన్ ర్యాలీకి హాజరుకానున్న రాజ్‌నాథ్‌సింగ్. అనంతరం సికింద్రాబాద్‌లో బీజేపీ బహిరంగ సభ. సాయంత్రం ఖమ్మం వెళ్లనున్న రాజనాథ్ సింగ్. వినోద్‌రావు నామినేషన్‌లో పాల్గొననున్న రాజ్‌నాథ్.
నేడు తొలి విడత లోక్‌సభ ఎన్నికల సమరం. తొలి విడతలో 21 రాష్ట్రాల్లో 102 స్థానాలకు పోలింగ్. తొలి విడతలో ఓటు వేయనున్న 16.63 కోట్ల మంది.
నేడు చీపురుపల్లిలో నామినేషన్ వెయ్యనున్న బొత్స సత్యనారాయణ.. క్యాంప్ కార్యాలయం నుంచి ర్యాలీ.. చీపురుపల్లి మూడు రోడ్లకూడలి వద్ద బహిరంగ సభ..
