1. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. ఉదయం 9.40 గంటలకు ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్. ఉదయం 10 గంటలకు సైనిక్ స్మారక చిహ్నం దగ్గర నివాళులు. ఉదయం 10.15కు గోల్కొండ కోటకు బయల్దేరనున్న కేసీఆర్. ఉదయం 10.50 గంటలకు సీఎంకు స్వాగతం పలకనున్న పోలీసులు. ఉదయం 11 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్న కేసీఆర్. ఉదయం 11.05 గంటలకు రాష్ట్ర ప్రగతిపై కేసీఆర్ ప్రసంగం.
2. నేడు విజయవాడలో స్వాతంత్ర్య వేడుకలు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటలకు జెండా ఎగరేయనున్న సీఎం జగన్. సాయంత్రం 5.30కి రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం.
3. ఢిల్లీ : ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలు. రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించిన ప్రధాని. ప్రధానికి స్వాగతం పలికిన రాజ్‌నాథ్, స్పీకర్. జాతీయ జెండాను ఎగరవేయనున్న మోడీ. 10వ సారి ప్రధానిగా మోడీ పతకావిష్కరణ.
4. నంద్యాల : నేడు శ్రీశైలంలో నందీశ్వరస్వామికి విశేషాభిషేకం, ప్రత్యేక పూజలు.
5. గుంటూరు : పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న ఇంఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు.
6. ప్రకాశం : జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రాంతాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. ఒంగోలు లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్న ఇంచార్జీ మినిస్టర్ మేరుగ నాగార్జున, హాజరుకానున్న పలువురు ప్రజాప్రతినిధులు..
7. కరీంనగర్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు తంగళ్లపల్లి మండలం సారంపల్లి లో సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ, గౌడ కమ్యూనిటీ హల్ ప్రారంభోత్సవం.
8. ఖమ్మం : నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో కోటి రూపాయల వ్యయం తో చేపట్టిన సోలార్ సిస్టమ్ ను ప్రారంభించనున్న మంత్రి అజయ్ కుమార్.
9. నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు. సిద్దిపేట జిల్లాలో జాతీయ పతాకాన్ని అవిష్కరించనున్న మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్న మంత్రి తలసాని. సంగారెడ్డి జిల్లాలో జాతీయ జెండా ఎగురవేయనున్న మంత్రి మహమూద్ అలీ.
10. అమరావతి : సచివాలయంలో జాతీయ జెండా ఎగరేసిన సీఎస్ జవహర్ రెడ్డి. ఉద్యోగులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎస్.
