NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం.

ప్రధాని మోడీ నేడు యూపీలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్‌ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు.

విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు మంగళవారం ప్రత్యేక రైలు నడిపించనున్నట్లు రైల్వే శాఖ సోమవారం తెలిపింది. విశాఖపట్నం నుంచి సాయంత్రం 4.15కి బయల్దేరే రైలు (నం.08589) మరుసటిరోజు ఉదయం 6.15కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక రైలు (నం.08590) బయల్దేరి అదేరోజు రాత్రి 11.30కి గమ్యస్థానం చేరుతుంది.

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై రౌజ్‌ అవెన్యూ కోర్టు మంగళవారం విచారించనుంది. న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారమే దీనిపై విచారణ చేపట్టాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల మంగళవారానికి వాయిదావేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ సెలవు ప్రకటిస్తూ ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. దానికి తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.