Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు తెలంగాణలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష. 33 జిల్లా కేంద్రాల్లో 994 పరీక్ష సెంటర్ల ఏర్పాటు. పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేత. ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి. పేపర్‌ లీక్‌ను దృష్టిలో పెట్టుకొని కఠిన నిబంధనలు. నిబంధనలు ఉల్లంఘిచినవారిపై క్రిమినల్‌ కేసులు.

2. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,550 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,500లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.79,800 లుగా ఉంది.

3. నేడు డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఐదో రోజు ఆట. నిన్న ఆట ముగిసే సమయానికి భారత్‌ స్కోర్‌ 164/3. క్రీజులో కోహ్లీ 44, రహానె 20 పరుగులు. 444 పరుగుల లక్ష్య ఛేదనలో పోరాడుతున్న భారత్‌. విజయానికి 280 పరుగుల దూరంలో టీమిండియా.

4. నేడు ఫ్రెంచ్‌ ఓపెన్‌ పురుషుల ఫైనల్‌. ఫైనల్‌లో క్యాస్పర్‌ రూడ్‌తో తలపడనున్న జకోవిచ్‌. సాయంత్రం 6.30గంటలకి మ్యాచ్‌ ప్రారంభం.

5. నేడు ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మహార్యాలీ. ఢిల్లీ పరిపాలనా సేవలపై కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ర్యాలీ. పాల్గొననున్న కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌సింగ్‌.

6. నేడు విశాఖలో అమిత్‌ షా పర్యటన. ప్రధాని మోడీ 9 ఏళ్ల పాలన విజయోత్సవాలు. విజయోత్సవాల్లో పాల్గొననున్న అమిత్‌ షా.

7. నేడు కొత్తగూడెంలో సీపీఐ ప్రజాగర్జన సభ. హాజరుకానున్న డి.రాజా, పలువురు నేతలు. సాయంత్రం ప్రకాశం స్టేడియంలో బహిరంగ సభ.

8. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్రవాడ లో జరిగే శ్రీ వెంగమాంబ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Exit mobile version