Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

ఏలూరు: నేడు పోలవరం ప్రాజెక్టకు మంత్రి నిమ్మల రామానాయుడు. ఉదయం 9 గంటలకు డయాఫ్రంవాల్‌ నిర్మాణ పనుల పరిశీలన. అనంతరం ఇంజనీరింగ్‌ అధికారులు, ఏజేన్సీలతో మంత్రి సమీక్ష.

నేడు ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం. విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో తీవ్ర ఎండలు ఉండే ఛాన్స్‌.

నేడు ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ మహిళా విభాగం పిలుపు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా ప్రదర్శనలు.

ఢిల్లీ : నేడు ఖర్గేతో భేటీకానున్న సీఎం రేవంత్‌. ముగ్గురు కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు నిర్ణయం.

నేడు ఎంపీల అఖిలపక్ష బృందంతో ప్రధాని మోడీ సమావేశం. రాత్రి 7 గంటలకు ఏడు ఎంపీ బృందాలకు డిన్నర్‌.

ఏపీ లిక్కర్‌ స్కాం కేసుపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. కేసిరెడ్డి, గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్లపై నేడు విచారణ. బెయిల్‌ పిటిషన్లపై విచారించనున్న ఏసీబీ కోర్టు.

IAS శ్రీలక్ష్మి కేసు నేడు లిస్ట్‌ చేయనున్న హైకోర్టు. ఓబుళాపురం మైనింగ్‌ కేసులో శ్రీలక్ష్మి నిందితురాలు. గతంలో శ్రీలక్ష్మిపై కేసు కొట్టివేసిన హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్‌ చేసిన సీబీఐ. తెలంగాణ హైకోర్టు తీర్పును కొట్టివేసిన సుప్రీం. మరోసారి విచారించాలని హైకోర్టుకు సుప్రీం ఆదేశం.

గుంటూరు: నల్లపాడు పీఎస్‌కు కొమ్మినేని శ్రీనివాసరావు. నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేసిన పోలీసులు. నేడు మంగళగిరి కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు.

హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 లుగా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,550 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,08,000 లుగా ఉంది.

 

Exit mobile version