Site icon NTV Telugu

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు రాత్రి 7.30 గంటలకు ముంబైలో బీజేపీ సమావేశం.

2. రాహుల్‌గాంధీపై పరువునష్టం కేసులో నేడు తీర్పు. గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన రాహుల్.

3. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు.

4. 24 క్యారెట్ల 10 గ్రామలు బంగార ధర రూ. 59,160లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,250లు ఉంది. అలాగే.. కిలో వెండి ధర రూ. 76,700లుగా ఉంది.

5. నేడు ములుగు, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్‌.

6. నేడు మంగళగిరిలో పార్టీ నేతలతో పవన్‌ కల్యాణ్‌ సమావేశం.

7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు నేడు ఉదయం 8.00 గంటలకు మాడుగుల మండలం ఒమ్మాలి గ్రామంలో నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.

8. తూర్పుగోదావరి జిల్లాలో నేడు ప్రజా సమస్యలపై సీపీఐ ఆధ్వర్యంలో బొమ్మూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా .

9. నేడు హోం మంత్రి తానేటి వనిత తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 11 గంటలకు కొవ్వూరు మండలం పెనకాన మెట్ట గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే మధ్యాహ్నం 12.45 గంటలకు తాడేపల్లిగూడెం నల్లజర్ల రోడ్ మాగంటి కళ్యాణ మండపంలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాజరవుతారు.

10. నేడు తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్న విద్యా శాఖ.

Exit mobile version