Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whats Today

Whats Today

1. నేడు తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం. ఉదయం 9 గంటలకు నుంచి ఉదయం 10 గంటల వరకు భక్తులతో మాట్లాడనున్న ఈవో ధర్మారెడ్డి. భక్తులు సంప్రదించాల్సిన ఫోన్‌ నెం : 0877-2263261.

2. వరల్డ్‌ కప్‌లో నేడు పాకిస్తాన్‌ వర్సెస్‌ నెదర్లాండ్‌. హైదరాబాద్‌ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌.

3. పుంగనూరు అల్లర్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. టీడీపీ నేతల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ.

4. సింగరేణి ఎన్నికలు వాయిదా వేయాలని హైకోర్టును ఆశ్రయించిన యాజమాన్యం. విచారణ ఈనెల 11కు వాయిదా. షెడ్యూల్‌ ప్రకారం ఈ రోజు, రేపు నామినేషన్లు స్వీకరణ. కార్మికుల మెయిల్స్‌ పంపిణి కేంద్ర కార్మిక శాఖ. నేడు నామినేషన్లు వేయనున్న ఏఐటీయూసీ, బీఎంఎస్‌.

5. ఢిల్లీలో నేడు ఎన్నికల పరిశీలకులతో భేటీ కానున్న ఈసీ. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై చర్చ. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన తుది వ్యూహాన్ని ఖరారు చేయనున్న ఈసీ.

6. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,160 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,400 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.73,500 లుగా ఉంది.

7. ఈ రోజు రాత్రి 7 గంటలకు కేటీఆర్‌ సమక్షంలో చేరిక.  5 రోజుల క్రితం కాంగ్రెస్‌కు కంఠారెడ్డి రాజీనామా.

8. లండన్‌లో ఎమ్మెల్సీ కవిత. నేడు బ్రిడ్జ్‌ ఇండియా సమావేశంలో పాల్గొననున్న కవిత. ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామంపై కవిత ప్రసంగం.

9. ఢిల్లీలో ఏపీ సీఎం జగన్‌. నేడు వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సు. సదస్సులో పాల్గొనున్న సీఎం జగన్‌. రాత్రి అమిత్‌ షాతో సమావేశం కానున్న జగన్‌.

10. నేడు చంద్రబాబు పిటిషన్లపై విచారణ. బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ.

11. నేడు రాజమండ్రికి నారా లోకేష్‌. 20 రోజుల తర్వాత రాజమండ్రికి నారా లోకేష్‌. చంద్రబాబుతో ములాఖత్‌ కానున్న లోకేష్‌.

12. నేడు ఢిల్లీ వెళ్లనున్న రేవంత్‌ రెడ్డి. మల్లికార్జునఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్న ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మనోహర్‌రెడ్డి.

13. బీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యే రేఖానాయక్‌ గుడ్‌బై. నేడు రాజీనామాపై ప్రకటన చేయనున్న రేఖానాయక్‌. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న రేఖానాయక్‌.

 

Exit mobile version