Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. నేడు పశుసంవర్థకశాఖపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష. మధ్యాహ్నం సెక్రటేరియట్‌లో అధికారులతో సీఎం సమావేశం.

2. నేడు సాయంత్రం యూపీలో మంత్రి వర్గ విస్తరణ. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్న దారాసింగ్‌, ఓం ప్రకాష్‌. ఆర్‌ఎలడీ నుంచి రాజ్‌పాల్‌కు మంత్రి పదవి.

3. నేడు విజయవాడకు మానవ హక్కుల కమిషన్‌. కమిషన్‌ చైర్‌పర్సన్‌ అరుణ్‌ మిశ్రాతో పాటు కమిషన్‌ సభ్యుల పర్యటన. ఫిర్యాదులపై రేపు విచారణ చేయనున్న కమిషన్‌?

4. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,090 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,750 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 77,000 లుగా ఉంది.

5. నేడు ఉదయం సికింద్రాబాద్‌ జ్జయిని మహంకాళి ఆలయానికి మోడీ. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకోనున్న మోడీ. ప్రధాని పర్యటన సందర్భంగా నేడు ఉదయం 10.15 వరకు ట్రాఫిక్‌ మళ్లింపు.

6. నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన. పటేల్‌గూడలోని ఎస్‌ఆర్‌ ఇన్‌ఫినిటీలో ప్రధాని బహిరంగ సభ. రూ.9,021 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.

7. నేడు మంగళగిరిలో టీడీపీ జయహో బీసీ బహిరంగ సభ. బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించనున్న టీడీపీ-జనసేన. హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌, బాలకృష్ణ సహా రెండు పార్టీల బీసీ నేతలు.

8. నేడు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన. విజన్‌ వైజాగ్‌ సదస్సులో పాల్గొననున్న సీఎం జగన్‌. పారిశ్రామిక, వ్యాపార వేత్తల సదస్సుకు హాజరుకానున్న జగన్. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్న జగన్‌. తర్వాత భవిత పేరుతో కొత్త ప్రొగ్రాం ప్రారంభించనున్న సీఎం జగన్‌.

9. నేడు మరో రెండు సీట్లను ప్రకటించనున్న బీఆర్‌ఎస్‌. నేడు మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌ నేతలతో కేసీఆర్‌ భేటీ. ఇప్పటికే నాలుగు స్థానాలు ప్రకటించిన బీఆర్‌ఎస్‌.

10. నేడు సిరిసిల్లలో మాజీమంత్రి కేటీఆర్‌ పర్యటన. పార్లమెంట్‌ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా మండలస్థాయి సమావేశాల్లో పాల్గొననున్న కేటీఆర్‌. ఉదయం 11 గంటలకు ముస్తాబాద్‌ మండలం.. మధ్యాహ్నం ఒంటి గంటకు తంగళ్లపల్లి మండల కార్యకర్తల సమావేశం.

 

Exit mobile version