నేడు కుంభమేళాకు ప్రధాని మోదీ. ప్రయాగ్‌రాజ్‌లో ప్రత్యేక పూజలు చేయనున్న మోదీ. ఉదయం 11 గంటలకు త్రివేణి సంగమంలో స్నానం చేయనున్న మోదీ. అనంతరం ఢిల్లీకి మోదీ తిరుగు ప్రయాణం.
నేడు బీసీ కులగణనపై పవన్ పాయింట్ ప్రెజెంటేషన్. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ హాల్‌లో ప్రెజెంటేషన్. హాజరుకానున్న స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
ఢిల్లీలోనే మంత్రి నారా లోకేష్. నేడు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, ధర్మేంద్ర ప్రధాన్, కుమారస్వామిని నారా లోకేష్ కలిసే అవకాశం.
నేడు గాంధీభవన్‌లో మంత్రుల ముఖాముఖి. ముఖాముఖిలో పాల్గొననున్న మంత్రి సీతక్క.
నేడు బెంగళూరులో బీజేపీయేతర రాష్ట్రాల సీఎంల భేటీ. యూజీసీ జారీ చేసిన నిబంధనల ముసాయిదాపై చర్చ.
హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.85,800 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలు రూ.79,450 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధరలు రూ.96,500 లుగా ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న పోలింగ్. ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు. ఢిల్లీలో మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలు.
మహా కుంభమేళాకు పోటెత్తిన జనం. ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఇప్పటివరకు 38 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు.
నేడు విజయవాడ సిటీ కార్పొరేటర్లతో వైసీపీ అధినేత జగన్ భేటీ. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం. పలు రాజకీయ అంశాలు చర్చించే అవకాశం.