అమరావతి: ఏఆర్ డెయిరీ ఎండీ ముందస్తు పిటిషన్. రాజశేఖరన్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ. ఇంటీరియ్ ప్రొటెక్షన్ అడిగిన పిటిషనర్ న్యాయవాది. కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసు హైకోర్టును ఆశ్రయించిన సజ్జల. ముందస్తు బెయిల్ పిటిషన్ కోరుతూ పిటిషన్. నేడు విచారించనున్న హైకోర్టు.
నేడు నందిగం సురేష్ పిటిషన్‌పై విచారణ. బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఇవ్వనున్న హైకోర్టు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో నందిగం సురేష్ అరెస్ట్.
తిరుమల : నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సాయంత్రం 5.45 గంటల నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం. రాత్రి 8గంటలకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు. రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనంపై దర్శనమివ్వనున్న మలయప్పస్వామి. బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో ప్రైవేట్ ట్యాక్సీలపై ఆంక్షలు. తిరుమలలో 9 రోజుల పాటు ట్యాక్సీలకు అనుమతి నిరాకరణ.
విజయనగరం: నేడు విశాఖ-బొబ్బిలి-సాలూరుకు రైలు ట్రయల్ రన్. మధ్యాహ్నం 12 గంటలకు ట్రయల్ రన్ చేయనున్న రైల్వే అధికారులు.
విజయవాడ: నేడు ఇంద్రకీలాద్రిపై గాయత్రిదేవి అవతారంలో అమ్మవారు.
నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.77,560 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,01,000 లుగా ఉంది.
హైదరాబాద్: నేడు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర బతుకమ్మ వేడుకలు.
టీ20 ప్రపంచకప్: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్. టీ20 ప్రపంచకప్‌లో తొలిపోరుకు సిద్ధమవుతున్న మహిళా టీమిండియా.
నేడు శ్రీశైలంలో రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు. బ్రహ్మచారిణి అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు.
నేడు నిజామాబాద్ జిల్లాలకు టీపీసీసీ చీఫ్ మహేష కుమార్ గౌడ్. కాంగ్రెస్ బహిరంగ సభలో పాల్గొననున్న మహేష్ గౌడ్. సభలో పాల్గొననున్న 8మంది మంత్రులు, ఎమ్మెల్యేలు. పీసీసీ చీఫ్‌గా తొలిసారి సొంత జిల్లాకు మహేష్ కుమార్.
తెలంగాణలో కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు. మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ.
లడ్డూ కల్తీ వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ. ఉదయం 10.30 గంటలకు విచారణ జరపనున్న జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్ ధర్మాసనం. సుదీర్ఘంగా వాదనలు కొనసాగే అవకాశం.