NTV Telugu Site icon

What’s Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

1. తెలంగాణలో కొత్త లిక్కర్‌ షాపులకు నోటిఫికేషన్‌ జారీ. నేడు షాపుల రిజర్వేషన్లపై డ్రా తీయనున్న కలెక్టర్లు. రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఈ నెల 18 దరఖాస్తులకు చివరి తేదీ, ఈ నెల 21న డ్రా. డిసెంబర్‌ ఒకటితో ముగియనున్న వైన్స్‌ కాలపరిమితి.

2. తెలంగాణలో రైతు రుణమాఫీకి కేసీఆర్‌ ఆదేశం. నేటి నుంచి రైతు రుణమాఫీ కొనసాగింపు. తొలి విడతలో మిగిలిన రూ.19 వేల కోట్ల రుణాల మాఫీ. విడతలవారీగా రైతులకు రుణమాఫీ చెక్కుల పంపిణీ. సెప్టెంబర్‌ రెండోవారంలోగా రుణమాఫీ పూర్తి.

3. నేడు తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సంబరాలు. రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై సంబరాలు. ప్రతీ గ్రామంలో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలని కేటీఆర్‌ పిలుపు.

4. చెన్నై : నేటి నుంచి ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీ. తొలిరోజు చైనాతో తలపడనున్న భారత జట్టు. రాత్రి 8.30 మ్యాచ్‌ ప్రారంభం.

5. HYD : నేడు మత్స్యశాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరసనలు. ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని డిమాండ్‌. ఈ నెల 5 వరకు కొనసాగనున్న నిరసనలు.

6. నేడు వెస్టిండీస్‌, భారత్‌ మధ్య తొలి టీ20 మ్యాచ్‌. రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం.

7. హైదరాబాద్‌ నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,110 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,300 లుగా ఉంది.

8. నేడు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి కృష్ణారావు. ఉదయం 9.30 గంటలకు కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి.

9. నేడు తెలంగాణ గ్రూప్‌-1పై హైకోర్టులో విచారణ. వాదనలు వినిపించనున్న అడ్వొకేట్‌ జనరల్‌.

10. నేడు ప్రధాని మోడీని కలవనున్న బండి సంజయ్‌. ఉదయం 11 గంటలకు మోడీతో బండి సంజయ్‌ భేటీ. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా రేపు బాధ్యతలు స్వీకరించనున్న బండి సంజయ్‌.