NTV Telugu Site icon

Whats Today : ఈ రోజు ఏమున్నాయంటే?

Whats Today

Whats Today

తిరుమల: రేపు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు. ఇవాళ, రేపు, ఎల్లుండి తిరుపతిలో జారీ చేసే సర్వదర్శనం టోకెన్లు రద్దు చేసిన టీటీడీ. ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.

నేడు గుంటూరు కార్పొరేషన్ లో స్టాండింగ్ కమిటీ ఎన్నిక … ఉత్కంఠ గా మారిన స్టాండింగ్ కమిటీ ఎన్నిక… ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు జరగనున్న ఎన్నికలు.. స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 56 మంది కార్పొరేటర్లు… స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు, ఇప్పటికే హైదారాబాద్ లో క్యాంపు రాజకీయాలు నడిపిన, వైసీపీ, కూటమి పార్టీలు..

నెల్లూరు జిల్లా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో, నేటి నుంచి మార్చి 3 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ కార్యక్రమాలు రద్దు..

శ్రీ సత్యసాయి: నేడు హిందూపురం మున్సిపల్ ఛ్తెర్మన్ ఎన్నిక. క్యాంప్ నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి రానున్న టీడీపీ కౌన్సిలర్లు. తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో వ్తెసీపీ. నియోజకవర్గంలోనే మకాం వేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ.

ఎన్టీఆర్ జిల్లా : నేడు నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపిక. ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు.

ఏలూరు జిల్లా : నేడు నూజివీడుసర్వ మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశం. నేడు కొత్త వైస్ చైర్ పర్సన్ ఎంపిక. ఇప్పటికే చైర్మన్ కూడా పార్టీ మరి టీడీపీలో చేరతారని ప్రచారం. వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు సిద్ధమైన కొందరు కౌన్సిలర్లు.

అమరావతి : రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు,కార్పొరేషన్ లలో ఖాళీగా ఉన్న చైర్ పర్సన్ ,వైస్ ఛైర్పర్సన్,డిప్యూటీ మేయర్ ల ఎన్నిక. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ లకు డిప్యూటీ మేయర్లు,నందిగామ,హిందూపురం,పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్ లకోసం ఎన్నిక. బుచ్చిరెడ్డిపాలెం,నూజివీడు,తుని,పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్ పర్సన్ ల కోసం జరగనున్న ఎన్నిక. ఆయా మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని.

అల్లూరి జిల్లా ముంచింగిపుట్టు మండలం జోళపుట్టు జలాశయంలో పడవ బోల్తా పడిన ఘటనలో మూడవరోజు కొనసాగుతున్న గాలింపు చర్యలు.. జలాశయంలో రీల్స్ చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు గల్లంతు. జోలపుట్ జలాశయంలో రీల్స్ కోసం శనివారం సాయంత్రం నాటు పడవ పై వెళ్లిన గౌతం, శివ, అమిత్ ముగ్గురు విద్యార్దులు.

ఖమ్మం జిల్లాలో నేడు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిల పర్యటన.

నేడు తెలంగాణ సెక్రటేరియట్ లో ఎస్సీ వర్గీకరణ పై ఏకసభ్య జ్యూడిషియల్ కమిషన్ ఇచ్చిన సిఫారసులపై సబ్ కమిటీ సమావేశం. హాజరుకానున్న సబ్ కమిటీ ఛైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో చైర్మన్ దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు.

నేడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకి మొండి చేయి చూపించారని నిరసిస్తూ ఆందోపనలికి పీసీసీ పిలుపు.

నేడు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లలో ఎమ్మెల్సీ కవిత పర్యటన. ఉదయం 11 గంటలకు కరీంనగర్ లో ఓ షాప్ ప్రారంభించనున్న కవిత. అనంతరం పెద్దపల్లిలో తెలంగాణ తల్లికి పూలమాల వేసి పలు.పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న కవిత. పెద్దపల్లి పార్టీ కార్యాలయంలో టిబిజికెఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్సీ.

నేడు వసంత పంచమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల కిటకిట. వేకువజాము నుంచే దర్శనానికి బారులు తీరిన భక్తులు.