NTV Telugu Site icon

Chandoo Mondeti : చందు మొండేటి నెక్ట్స్ ఏంటి?

Chandoo

Chandoo

నిఖిల్ తో కార్తికేయ2, నాగ చైతన్యతో తండేల్ ఇలా వరుసగా రెండు భారీ హిట్స్‌ కొట్టిన దర్శకుడు చందు మొండేటి నెక్ట్స్‌ ప్లాన్‌ ఏంటి ఏ హీరోను లైన్లో పెట్టాడు అనే చర్చ రావడం సహజమే. ఇప్పటికైతే మూడు సినిమాలు ప్రకటించాడు దర్శకుడు. మరి ఏ మూవీతో ముందుకొస్తాడు అనేది ఇప్పుడు డిస్కషన్. రియల్ ప్రేమకథ అయినా తండేల్ బ్రేక్‌ ఈవెన్‌  సాధించి ఇప్పటికే రూ. 10 కోట్ల లాభం తీసుకొచ్చింది. కార్తికేయ2తో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టిన చందు కార్తికేయ 3ను లైన్లో పెట్టినా గ్యాప్‌ తీసుకుని తండేల్‌ తీశాడు.

Also Read : Nandamuri Balakrishna : డిజాస్టర్ డైరెక్టర్ కు బాలయ్య ఛాన్స్.. ?

మరోవైపు నాగచైతన్యను తెనాలి రామకృష్ణగా చూపిస్తానని గతంలో ఎనౌన్స్‌ చేశాడు. అలాగే సూర్యతో సినిమా అనే టాక్ కూడా ఉంది.  చందు మొండేటి ఆల్రెడీ సూర్యాను కలిసి కథ చెప్పాడు. హీరో గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే ముందుగా సూర్య సినిమా మొదలవుతుందని దర్శకుడు చెబుతున్నాడు. ఆ తర్వాతే కార్తికేయ 3 తీయాలని డిసైడ్‌ అయ్యాడు. కానీ ఇది ఇప్పట్లో ఉండకపోవచ్చు. సూర్య వెంకీ అట్లూరి సినిమాకు సైన్ చేసాడు అని చెన్నై వర్గాల టాక్.  కార్తికేయ2 హిట్‌ తర్వాత చందు మొండేటికి నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్స్‌ ఇచ్చినా అప్పటికే కమిటైన గీతా ఆర్ట్స్‌ను వదిలిపెట్టలేదు. ఈ విషయాన్ని అల్లు అరవిందే స్వయంగా చెప్పాడు. గీతా ఆర్ట్స్‌ ఆల్రెడీ సూర్య, బోయపాటి కాంబోలో ఓ సినిమా ప్లాన్‌ చేసినా వర్కవుట్ కాలేదు. మరి సూర్య కోసం చందు వెయిట్ చేస్తాడా లేదా ఈ గ్యాప్ లో కార్తికేయ 3ని పట్టాలెక్కిస్తాడా అనేది మరికొద్ది రోజులు ఆగితే కానీ క్లారిటీ రాదు.