Site icon NTV Telugu

Game Changer : గేమ్ ఛేంజర్ అప్పన్న గురించి సాయి దుర్గా తేజ్ ఏమన్నారంటే ?

Sai Dharam Tej

Sai Dharam Tej

Game Changer : గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన ‘గేమ్ ఛేంజ‌ర్’ మూవీ నేడు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మ‌రి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా లేదా అన్నది పక్కన పెడితే.. సినిమాలో ‘అప్ప‌న్న’ పాత్ర మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుందని అందరి నోట వినిపిస్తున్న మాట. ఆ పాత్ర‌ను శంక‌ర్ తీర్చిదిద్దిన తీరుకు అంతా డైరెక్టర్ ను మెచ్చుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలో మెగా మేన‌ల్లుడు సాయిదుర్గ తేజ్ కూడా వ‌చ్చాడు. ఈ సంద‌ర్భంగా చ‌ర‌ణ్ నుంచి అతడికి న‌చ్చిన కొన్ని పాత్ర‌ల‌ను తీసుకుని ఆకాశానికి ఎత్తేశాడు. ‘మ‌గ‌ధీర‌’లోని హ‌ర్ష‌, కాల‌భైర‌వ పాత్రలు ఫస్ట్ ప్లేసులో ఉంటే? ‘ఆరెంజ్’ చిత్రంలోని రామ్ పాత్ర తనను ఆకట్టుకుందన్నారు. అలాగే ‘రంగ‌స్థ‌లం’లోని చిట్టిబాబు పాత్ర‌కు థర్డ్ ప్లేస్ ఇచ్చాడు. ‘ ఆర్ ఆర్ఆ ర్’ చిత్రంలోని అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌కు ఫోర్త్ ప్లేస్ ఇచ్చాడు. మ‌రి ‘అప్ప‌న్న’ పాత్ర స్థానం ఏంటి? అంటే నెంబ‌వ‌ర్ 5గా క‌నిపిస్తుంది.

Read Also:Giorgia Meloni: ‘‘జార్జ్ సొరోస్’’పై ఇటలీ ప్రధాని ఫైర్.. మస్క్, బీజేపీ ఆరోపణలకు మద్దతు..

ఇందులో ఎలాంటి డౌట్ లేదు అంటూ ఇలా రాసుకొచ్చారు. అప్ప‌న్న పాత్ర‌కు జీవం పోయ‌డంలో మీ అంకిత భావానికి, నిబ‌ద్ద‌త‌కు ధ‌న్య‌వాదాలు. ఆ పాత్ర‌లో మీ న‌ట‌న‌ను చూడ‌టం ఓ క‌ల‌లా అనిపించింది. అప్ప‌న్న పాత్ర నుంచి ఎన్నో విష‌యాలు తీసుకోవ‌చ్చు. ఆ పాత్ర‌తో పూర్తి స్థాయి పరిణతి చెందిన నటుడిగా ఎదిగారు. శంక‌ర్ ఆ పాత్ర‌ను ఎంత‌లా న‌మ్మి తీసారా? అంత‌కు మించి జీవం పోసి మెప్పించారు’ అని రాసుకొచ్చారు.. ప్రస్తుతం తన పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. మెగా అభిమానుల్ని ఆక‌ట్టుకుంటున్న పోస్ట్ గా మారింది. ప్ర‌స్తుతం సాయిదుర్గ తేజ్ ‘సంబ‌రాల ఏటిగ‌ట్టు’ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Read Also:Daaku Maharaaj: ఇది కదా ఫ్యాన్స్ కి కావల్సింది.. వాడు మనిషి కాదు వైల్డ్ యానిమల్

Exit mobile version