* తిరుమల: ఆగస్టు 7వ తేదిన టీటీడీ పాలకమండలి సమావేశం.. 8వ తేదితో ముగియనున్న ప్రస్తుత పాలకమండలి కాలపరిమితి
* తిరుమల: ఇవాళ శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. సాయంత్రం పుష్ప పల్లకిలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్పస్వామి
* ప్రకాశం: దోర్నాల మండలం యడవల్లిలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
* అంబేద్కర్ కోనసీమ: నేడు రామచంద్రపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
* తిరుపతి: నేడు తిరుపతికి పవన్ కళ్యాణ్.. శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ వ్యవహారంపై నేరుగా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయనున్న పవన్ కళ్యాణ్.. పాత తిరుపతి విమానాశ్రయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు జనసైనికుల బైక్ ర్యాలీ
* నెల్లూరులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో బీసీ నేతల సమావేశం.. నెల్లూరులోని కలెక్టరేట్ ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం
* నంద్యాల: మహానందిలో నేడు సోమవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, సాయంత్రం పల్లకి సేవ
* తూర్పుగోదావరి జిల్లా: నేడు కలెక్టర్, ఎస్పీ కలిసి జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక స్పందన.. ప్రజల నుంచి ఆయా గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో సంబంధిత సిబ్బంది ఒక్క చోట నుంచి స్పందన అర్జీలు స్వీకరణ
* అనకాపల్లిజిల్లా: నేడు చోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం రాజన్న దొర
* వరంగల్: నేడు, రేపు గ్రేటర్ వరంగల్ పరిధిలో మంచి నీటి సరఫరా బంద్.. మిషన్ భగీరథ తాగునీటి శుద్ధీకరణ కేంద్రం ప్రధాన పైపు లైను మరమ్మతులు పనులు సాగుతున్నాయని వెల్లడించిన ఈఈ రాజయ్య
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday