NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whatstoday

Whatstoday

* నేడు సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. సంగారెడ్డి, ఆందోల్, పటాన్ చెరు నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి

* నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నేటి నుంచి పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులకు హోం సిక్ సెలవులు. తిరిగి 15న క్యాంపస్‌లో రిపోర్ట్ చేయాలని అధికారుల ప్రకటన

* నేడు భద్రాద్రి అశ్వాపురంలో బారాజల కర్మాగార ఎంప్లాయిస్ అసోసియేషన్ ఎన్నికలు.. ఓటు హక్కును వినియోగించుకోనున్న 610 మంది ఉద్యోగులు

* డ్వాక్రా మహిళలకు రూ.1,353.76 కోట్ల వడ్డీ రాయితీ జమ.. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 1.05 కోట్ల మంది మహిళల ఖాతాల్లోకి బటన్ నొక్కి రూ.1,353.76 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్

* నేడు పార్టీ ముఖ్య నేతలతో పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం.. ఋషికొండ, ఎర్రమట్టి కొండలు సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై చర్చించనున్న జనసేనాని

* నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం.. సోనియాగాంధీ అధ్యక్షతన ఉ.10:30 గంటలకు జరగనున్న సమావేశం.. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ సస్పెన్షన్‌పై చర్చ

* పశ్చిమ గోదావరి: తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటన.. పలు కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి

* నేడు సీఎం జగన్ అమలాపురంలో పర్యటన.. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం నాలుగో విడత నిధులను విడుదల చేయనున్న సీఎం

* నెల్లూరులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

* విశాఖ: బీచ్ రోడ్డులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ.. జాతీయ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్న పోస్టల్ ఉద్యోగులు

* విశాఖ: నేడు విశాఖకు తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర ప్రతినిధుల బృందం రాక.. రేపు భీమిలి సమీపంలోని ఎస్ఓఎస్ ఆర్ఫన్ విలేజ్‌ను సందర్శించనున్న ప్రతినిధుల బృందం

* ఉదయం 9 గంటలకు సర్క్యూట్ హౌస్‌లో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం

* కృష్ణా: నేడు జిల్లాకు మంత్రి రోజా.. అవనిగడ్డలో వైయస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి రోజా

* శ్రీకాకుళం: రణస్థలంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో గడప గడపకూ మన ప్రాభుత్వం కార్యక్రమం.. హాజరుకానున్న ఎమ్మెల్యే కిరణ్, మంత్రి బొత్స సత్యనారాయణ

* నిర్మల్: ఇవ్వాళ జిల్లాలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన.. బీసీ బందు చెక్కులను పంపిణీ చేయనున్న మంత్రి