NTV Telugu Site icon

Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?

Whats Today New

Whats Today New

* నేటి నుంచి 26 వరకు మహిళల క్రికెట్ ప్రీమియర్ లీగ్.. టోర్నీలో తలపడనున్న 5 జట్లు.. రాత్రి 7:30కి గుజరాత్ వర్సెస్ ముంబై తొలి మ్యాచ్
* నేడు గాంధీభవన్‌లో డీసీసీ అధ్యక్షులతో ఇన్‌ఛార్జ్ థాక్రే సమావేశం.. మధ్యాహ్నం మండల అధ్యక్షులతో థాక్రే భేటీ.. హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై చర్చ
* నేడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి పట్టాభి విడుదల.. పట్టాభికి కండీషనల్ బెయిల్ మంజూరు చేసిన కృష్ణా జిల్లా కోర్టు
* నేటితో ముగియనున్న మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ.. లిక్కర్ స్కాంలో సిసోడియాను 5 రోజుల పాటు విచారించిన సీబీఐ.. ఇవాళ రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్న సీబీఐ.. స్పెషల్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సిసోడియా
* అమరావతి: నేడు పోలవరంపై కీలక సమావేశం.. పోలవరంలో డ్యాం డిజైనింగ్ రివ్యూ ప్యానెల్ బృందం పర్యటన.. పోలవరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలను పరిశీలించనున్న బృందం
* ఏలూరు: ఈ రోజు సాయంత్రం పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకోనున్న మంత్రి అంబటి రాంబాబు.. ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం ప్రాజెక్ట్ ప్రాంతంలో రాత్రి బస చేయనున్న మంత్రి అంబటి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాజమండ్రి రాక.. సాయంత్రం రాజమండ్రి ఆనం రోటరీ హాల్‌లో జరిగే కార్యక్రమంలో ప్రమాద భీమా చెక్కులను పంపిణీ చేయనున్న నాదెండ్ల
* విశాఖలో రెండోరోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్.. పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్న ఏపీ ప్రభుత్వం

Show comments