NTV Telugu Site icon

Renuka Chaudhary: షర్మిల పాలేరు టికెట్ అడగడానికి ఏముంది.. రేణుకా చౌదరి ఘాటు వ్యాఖ్యలు

Renuka

Renuka

వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లకు తెలంగాణ కోడలు అని గుర్తొచ్చిందా? అంటూ ప్రశ్నించారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే.. నేను ఖమ్మం జిల్లా ఆడబిడ్డను అన్నారు. ఖమ్మం జిల్లాలో రాజకీయాలపై తన అభిప్రాయం కూడా కీలకమేనని చెప్పుకున్నారు. నాకు ఆంధ్రలో ఎంత హక్కు ఉందో.. ఇక్కడ షర్మిలకూ అంతేనన్నారు. అసలు కాంగ్రెస్‌లోకి వచ్చేవారు షర్మిల ఒక్కరేనా.. ఇంకా ఎవరైనా మిగిలారా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో షర్మిల ఏ స్థానానైనా అడగొచ్చు.. అడిగేందుకు ట్యాక్స్‌ లేదు కదా అంటూ సెటైర్లు వేశారు. షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా, పాలేరులో పోటీ చేస్తా అని చెప్పడానికి షర్మిల ఎవరు అని మండిపడ్డారు. ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో మా అధిష్టానం చెప్పాలన్నారు.

Read Also: Tomato: టమాటాలు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..!

వైఎస్ఆర్టీపీ విలీనంపై షర్మిల, రాహుల్, సోనియాను కలిశారంతే అన్న రేణుకా చౌదరి.. వాళ్లు ఇంకా ఏం చెప్పలేదన్నారు. షర్మిల తెలంగాణలో పోటీచేసే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె తెలిపారు. అయితే విలీనాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నుంచి ఓ వర్గం వ్యతిరేకిస్తుండగా మరో వర్గం స్వాగతిస్తుంది. ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని? అంటూ సూటిగా ప్రశ్నించారు. షర్మిల ముందుగా అమరావతి రైతుల గురించి మాట్లాడాలని సూచించారు. ఈ క్రమంలో రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే పాలేరు నుంచి మాజీ మంత్రి తుమ్మలనాగేశ్వర్ రావు,మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.