Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News What Is The State Of Relations Between Britain And India

UK-INDIA: నూతన బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్..బ్రిటన్‌-భారత్ మధ్య సంబంధాల పరిస్థితేంటి..?

Published Date :July 5, 2024 , 5:39 pm
By RAMAKRISHNA KENCHE
  • బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో రిషి సునక్ ఓటమి
  • కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబుల్ పార్టీ భారీ విజయం
  • భారతదేశం-బ్రిటన్ మధ్య సంబంధాల అంశంపై ప్రజల్లో చర్చ
UK-INDIA: నూతన బ్రిటన్ ప్రధానిగా కీర్ స్టార్మర్..బ్రిటన్‌-భారత్ మధ్య సంబంధాల పరిస్థితేంటి..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో రిషి సునక్ ఓటమి పాలయ్యారు. కన్జర్వేటివ్ పార్టీపై కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబుల్ పార్టీ భారీ విజయం సాధించింది. భారత సంతతికి చెందిన ప్రధాన మంత్రి సునక్ తన ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత కీర్ స్టార్మర్ ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. ఆయన శుక్రవారం బాధ్యలు స్వీకరించవచ్చని సమాచారం. లేబర్ పార్టీ 14 సంవత్సరాల తర్వాత బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చింది. భారతదేశం-బ్రిటన్ మధ్య సంబంధాల అంశంపై చర్చ జరుగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. రిషి సునక్ పదవీకాలంలో కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వాణిజ్యం ఒక ముఖ్యమైన అంశంగా ఉంది.

READ MORE: Nimmala Ramanaidu: ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..

రెండు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటున్నాయి. 2022-23లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 20.36 బిలియన్ డాలర్లు కాగా, 2023-24 నాటికి అది 21.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్యం అంశం బ్రిటన్‌లోని రెండు పార్టీల ఎజెండాలో ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కన్జర్వేటివ్ పార్టీ మేనిఫెస్టోలో ‘భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం, సాంకేతికత, రక్షణ రంగంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం’ అని పొందుపరిచారు. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న స్కాచ్ విస్కీపై సుంకాన్ని శాశ్వతంగా తొలగించడం గురించి మ్యానిఫెస్టోలో ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వస్తువులపై సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ కూడా ఉంది.

READ MORE:Airtel: 37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్..స్పందించిన ఎయిర్‌టెల్

భారతదేశంతో సంబంధాలపై కీర్ స్టార్మర్ అభిప్రాయం..
బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కైర్ స్టార్మర్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తామని, అందులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉంటుందని తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. బ్రిటీష్ మాజీ ప్రధానమంత్రి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు బోరిస్ జాన్సన్.. అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2022 దీపావళికి గడువు విధించారు. కానీ ఇది సాధ్యం కాలేదు. దీనికి సంబంధించి.. లేబర్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కన్జర్వేటివ్‌లను లక్ష్యంగా చేసుకుంది. దీనికి సంబంధించి తమ పార్టీ బలంగా ఉందని నిరూపించేందుకు ప్రయత్నించింది. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్మార్టర్ ఎన్నికైతే భారత్ తో ఇప్పటికే కన్సర్వేటివ్ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొనసాగనుంది. కాశ్మీర్‌పై భారత వ్యతిరేక వైఖరి కారణంగా మాజీ నాయకుడు కార్బిన్ హయాంలో కొంతవరకు దూరమైన భారతీయులతో లేబర్ పార్టీ సంబంధాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు స్టార్మర్ పనిచేశారు. ఇది మారిన లేబర్ పార్టీ అని, భారత్ తో ప్రజాస్వామ్యం, ఇతర ఆకాంక్షల విషయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని స్టార్మర్ తాజాగా ప్రకటించారు. ఇవన్నీ భారత్ కు అనుకూలించే అంశాలే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Britain- India
  • international agreements
  • Keir Stormer
  • LATEST TELUGU NEWS
  • new Prime Minister of Britain

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions