బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికలలో రిషి సునక్ ఓటమి పాలయ్యారు. కన్జర్వేటివ్ పార్టీపై కీర్ స్టార్మర్ నేతృత్వంలోని లేబుల్ పార్టీ భారీ విజయం సాధించింది. భారత సంతతికి చెందిన ప్రధాన మంత్రి సునక్ తన ఓటమిని అంగీకరించారు. ఆ తర్వాత కీర్ స్టార్మర్ ఇప్పుడు బ్రిటన్ కొత్త ప్రధానమంత్రి కానున్నారు. ఆయన శుక్రవారం బాధ్యలు స్వీకరించవచ్చని సమాచారం. లేబర్ పార్టీ 14 సంవత్సరాల తర్వాత బ్రిటన్‌లో అధికారంలోకి వచ్చింది. భారతదేశం-బ్రిటన్ మధ్య సంబంధాల అంశంపై చర్చ జరుగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ దాదాపు స్థిరంగా ఉన్నాయి. రిషి సునక్ పదవీకాలంలో కూడా సంబంధాలు బాగానే ఉన్నాయి. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో వాణిజ్యం ఒక ముఖ్యమైన అంశంగా ఉంది.
READ MORE: Nimmala Ramanaidu: ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..
రెండు దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కోరుకుంటున్నాయి. 2022-23లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 20.36 బిలియన్ డాలర్లు కాగా, 2023-24 నాటికి అది 21.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. వాణిజ్యం అంశం బ్రిటన్‌లోని రెండు పార్టీల ఎజెండాలో ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కన్జర్వేటివ్ పార్టీ మేనిఫెస్టోలో ‘భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాం, సాంకేతికత, రక్షణ రంగంలో భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాం’ అని పొందుపరిచారు. చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న స్కాచ్ విస్కీపై సుంకాన్ని శాశ్వతంగా తొలగించడం గురించి మ్యానిఫెస్టోలో ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చల ద్వారా భారతదేశంలో బ్రిటిష్ వస్తువులపై సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ కూడా ఉంది.
READ MORE:Airtel: 37.5 కోట్ల భారతీయ కస్టమర్ల డాటా హ్యాక్..స్పందించిన ఎయిర్‌టెల్
భారతదేశంతో సంబంధాలపై కీర్ స్టార్మర్ అభిప్రాయం..
బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న కైర్ స్టార్మర్.. తమ పార్టీ అధికారంలోకి వస్తే, భారత్‌తో కొత్త వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేస్తామని, అందులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా ఉంటుందని తన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. బ్రిటీష్ మాజీ ప్రధానమంత్రి కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు బోరిస్ జాన్సన్.. అధికారంలో ఉన్నప్పుడు భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి 2022 దీపావళికి గడువు విధించారు. కానీ ఇది సాధ్యం కాలేదు. దీనికి సంబంధించి.. లేబర్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కన్జర్వేటివ్‌లను లక్ష్యంగా చేసుకుంది. దీనికి సంబంధించి తమ పార్టీ బలంగా ఉందని నిరూపించేందుకు ప్రయత్నించింది. బ్రిటన్ ప్రధానిగా కీర్ స్మార్టర్ ఎన్నికైతే భారత్ తో ఇప్పటికే కన్సర్వేటివ్ ప్రభుత్వం కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొనసాగనుంది. కాశ్మీర్‌పై భారత వ్యతిరేక వైఖరి కారణంగా మాజీ నాయకుడు కార్బిన్ హయాంలో కొంతవరకు దూరమైన భారతీయులతో లేబర్ పార్టీ సంబంధాల్ని తిరిగి పునరుద్ధరించేందుకు స్టార్మర్ పనిచేశారు. ఇది మారిన లేబర్ పార్టీ అని, భారత్ తో ప్రజాస్వామ్యం, ఇతర ఆకాంక్షల విషయంలో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తామని స్టార్మర్ తాజాగా ప్రకటించారు. ఇవన్నీ భారత్ కు అనుకూలించే అంశాలే.