PM Vishwakarma Yojana Benefits : మీరు చేతి కళాకారులా? ఇంట్లో చీరలు, బట్టలు నేసే పని లేదా కుమ్మరి, వడ్రంగి లేదా కమ్మరి పని చేసే వారు ఎవరైనా ఉన్నారా? అప్పుడు మీరు పీఎం విశ్వకర్మ యోజన గురించి పూర్తి సమాచారాన్ని పొందాలి. ముఖ్యంగా ఈ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రభుత్వ పథకం రూపొందించబడింది. పీఎం విశ్వకర్మ యోజనను ‘పీఎం వికాస్’ యోజన అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అమలును ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట ప్రాకారం నుండి ప్రకటించారు. ఈ పథకం లక్ష్యం దేశంలోని హస్తకళలలో నైపుణ్యం కలిగిన కళాకారులు, వ్యక్తులకు ఆర్థిక సహాయాన్ని అందించడంతోపాటు వారి నైపుణ్యాలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం…
పైన పేర్కొన్న విధంగా ఈ పథకం లక్ష్యం భారతదేశంలోని కళాకారులకు అన్ని విధాలుగా సహాయం అందించడం. ఇది నైపుణ్యాభివృద్ధి నుండి వారి కోసం శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం, వర్క్‌షాప్‌లను నిర్వహించడం, వారి ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపరచడం, ఆర్థిక సహాయం అందించడం వరకు ఉంటుంది. ఈ పథకం కింద హస్తకళాకారులు, చేనేత కార్మికులు, కుమ్మరులు, వడ్రంగులు, కమ్మరిలకు వారి సాంప్రదాయ పరిజ్ఞానంతో పాటు కొత్త మెళుకువలు నేర్చుకునేలా ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. తద్వారా ఉత్పత్తుల నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్‌కు సిద్ధంగా ఉండేలా చేయవచ్చు. అంతే కాకుండా ఈ కళాకారులకు ప్రభుత్వం నుంచి కొత్త ఆధునిక పరికరాలు కూడా అందజేయనున్నారు.
Read Also:Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్ కేసు నమోదు
అంతే కాదు వారందరికీ ప్రభుత్వం సులువుగా రుణాలు కూడా అందజేస్తుంది. ఈ లోన్‌లను పొందేందుకు మీరు ఏమీ తాకట్టు పెట్టనవసరం లేదు. ఇది మాత్రమే కాదు, ముడిసరుకు, యంత్రాల కొనుగోలు, వ్యాపార విస్తరణకు ప్రభుత్వం వారికి ఆర్థిక సహాయం అందిస్తుంది. పనిలో నిమగ్నమై ఉన్న 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ఏ వ్యక్తి అయినా లేదా అతని కుటుంబం హస్తకళకు సంబంధించిన ఏ పని చేసినా పీఎం విశ్వకర్మ యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రస్తుతం, ఈ పథకం ప్రయోజనం వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, నేత వంటి మొత్తం 18చేతి వృత్తులకు అందుబాటులో ఉంది.
ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి మీకు కొన్ని పత్రాలు అవసరం. వీటిలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, వర్క్ సర్టిఫికేట్, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా సమాచారం, ఆదాయ సమాచారం, కుల సమాచారం అవసరం ఉంటాయి. ప్రజలు వారి సమీప కామన్ సర్వీస్ సెంటర్ నుండి ఈ పథకం గురించి మరింత సమాచారాన్ని పొందవచ్చు.
Read Also:Medaram Jatara: మేడారంలో తక్షణ వైద్య సేవలు.. అందుబాటులో 40 బైక్ అంబులెన్స్‌లు