NTV Telugu Site icon

Green Crackers : గ్రీన్‌ క్రాకర్స్‌తో మీ పిల్లల ఆరోగ్యం భ్రదం.. దీపావళికి వీటినే కొనండి..

Green Crakcers

Green Crakcers

భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. అయితే.. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి దీపావళి పండుగను ఎంతో వైభవోపేతంగా నిర్వహించుకుంటున్నారు. అయితే.. ఇటీవల కాలంలో గాలిలో ఆక్సిజన్‌ శాతం తగ్గడంతో సుప్రీంకోర్టు బాణసంచాలపై నిషేదంవిధించింది. అయితే.. అనేక రాష్ట్రాల్లో, దీపావళి రోజు మరియు తరువాతి రోజుల్లో గాలి నాణ్యత సూచికలో తగ్గుదల కనిపిస్తుంది. అంతేకాకుండా.. చాలా నగరాల్లో పొగమంచు కనిపిస్తుంది. దీపావళి సందర్భంగా ప్రజల ఆరోగ్యం, తక్కువ గాలి నాణ్యత సూచికను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, 2018లో గ్రీన్ క్రాకర్ల ఉత్పత్తిని ఆదేశించింది. గ్రీన్ క్రాకర్‌ను తయారు చేసే బాధ్యతను CSIR- నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI)కి అప్పగించారు. దీనిని అనుసరించి, NEERI గ్రీన్ క్రాకర్‌లను రూపొందించడంలో సహాయపడే ఫార్ములాతో ముందుకు వచ్చింది.

Also Read : Worst Day of the Week : వారంలో చెత్త రోజుగా సోమవారం.. గిన్నిస్‌ రికార్డ్

ప్రధాన శాస్త్రవేత్త మరియు ఈఎండీ విభాగం అధిపతి, (CSIR NEERI) సాధన రాయలు గ్రీన్ క్రాకర్స్ గురించి వివరిస్తూ.. సాంప్రదాయ క్రాకర్లకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అని అన్నారు. “సాంకేతికంగా చెప్పాలంటే, గ్రీన్ క్రాకర్స్ డిజైన్ ద్వారా పర్యావరణానికి మేలు చేస్తాయి మరియు తులనాత్మకంగా తక్కువ కార్బన్ పాదముద్రను విడుదల చేస్తాయి” అని సాధన రాయలు పేర్కొన్నారు. “గ్రీన్ క్రాకర్లు సాంప్రదాయ క్రాకర్స్ లాగా ఉంటాయి. సాధారణంగా సంప్రదాయ క్రాకర్లలో ఆక్సిడైజర్లు ఉపయోగించబడతాయి. గ్రీన్ క్రాకర్లో ఉన్న తేడాలు మల్టీఫంక్షనల్ సంకలనాలు. ఇది ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుంది” అని సాధన రాయలు తెలిపారు. ప్రస్తుతం గ్రీన్‌ క్రాకర్స్‌ ఉత్పత్తికి దాదాపు 160 కర్మాగారాలు పనిచేస్తున్నాయి. దాదాపు 1000 ఫ్యాక్టరీలు నిషేధిత రసాయనాలను ఉపయోగించినందుకు లైసెన్స్‌ను కోల్పోయని సాధన రాయలు వెల్లడించారు. తయారీదారులు 100 శాతం స్వచ్ఛమైన పదార్థాన్ని ఉపయోగించడానికి ప్రయత్నించాలని అన్నారు. తయారీదారులకు సహాయం చేయడానికి, శివకాశిలో NEERI ప్రత్యేక యూనిట్‌ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు.