Bubonic Plague: 14వ శతాబ్ధంలో లక్షల మందిని బలిగొన్న వ్యాధి.. తాజాగా అమెరికాలో వెలుగులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bubonic Plague: 14వ శతాబ్ధంలో ప్రపంచాన్ని భయపెట్టిన, దాదాపుగా ఐరోపాలో 10 లక్షల మంది ప్రాణాలను తీసుకున్న ‘‘బుబోనిక్ ప్లేగు’’ అమెరికాలో గుర్తించారు. యూఎస్ ఓరేగాన్‌లో ఓ వ్యక్తిలో ఈ వ్యాధిని గుర్తించారు. డెస్చుట్స్ కౌంటీలో రోగికి పెంపుడు పిల్లి ద్వారా ఈ వ్యాధి సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పిల్లికి, రోగికి మధ్య కాంటాక్ట్ ఉన్నట్లు గుర్తించామని, అనారోగ్యాన్ని నివారించడానికి మెడికేషన్ ఇచ్చామని ఆ ప్రాంత ఆరోగ్య అధికారి డాక్టర్ రిచర్డ్ ఫాసెట్ ఒక ప్రకటనలో చెప్పారు.
ప్రస్తుతం వ్యాధి సోకిన వ్యక్తికి ప్రారంభ దశలోనే ఉన్నాడని, అతను తన సన్నిహితులకు ప్రమాదం అంచుకు తీసుకువచ్చాని వైద్యులు తెలిపారు. కొన్ని శతాబ్ధాల కింద లక్షలాది మరణాలకు కారణమైన ఈ వ్యాధి ప్రస్తుత కాలంలో కనిపించడం చాలా అరుదు. ఆ రోజుల్లో వ్యాధికి చికిత్స, పవర్ ఫుల్ యాంటీ బయాటిక్స్ లేకపోవడంతో చాలా మంది ప్రజలు మరణించారు. ప్లేగును కలిగించే బ్యాక్టీరియా జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. దీంతో దీన్ని పూర్తిగా తొలగించలేకపోవడానికి కారణమని వైద్యులు చెబుతున్నారు.
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్‌ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
Read Also: Jobs: భారతీయులకు గుడ్‌న్యూస్.. సౌదీలో భారీగా ఉద్యోగాలు.. జీతమెంతంటే..!
ఈ వ్యాధి 5 కోట్ల మందిని బలితీసుకుంది. ఎక్కువగా యూరప్ ప్రభావితమైంది. మూడో వంతు కేసులు ఇక్కడే నమోదయ్యాయి. చరిత్రలోనే అత్యంత ఘోరమైన మహమ్మారిగా ‘ప్లేగు’కి పేరుంది. దీనిని బ్లాక్ డెత్‌గా పిలుస్తారు. ఇది ‘యెర్సినాయి పెస్టిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా ప్లేగు వ్యాధి సంభవిస్తుంటుంది. దీనికి జంతువులు, మానవులు ప్రభావితమవుతారు. ఈగల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన జంతువు చనిపోయిన సందర్భంలో దాని అంతర్గత స్రావాలకు మానవుడు లేదా ఇతర ఏదైనా జంతువు కాంటాక్ట్ అయితే వ్యాధి సోకే అవకాశం ఉంది.
బుబోనిక్ ప్లేగు లక్షణాలు:
1. ఆకస్మికంగా అధిక జ్వరం మరియు చలి
2. చేతులు, కాళ్లు మరియు పొత్తికడుపులో నొప్పి.
3. తలనొప్పి
4. లింప్ నోడ్స్ వద్ద పెద్ద వాపు గడ్డలు అభివృద్ధి చెందుతాయి, వాటి నుంచి చీము కారుతుంది.
5. తీవ్రమైన సందర్భాల్లో, గ్యాంగ్రేన్ కారణంగా కణజాలం నల్లగా మారుతుంది, తరచుగా వేళ్లు లేదా కాలిపై ప్రభావం చూపుతుంది లేదా అసాధారణ రక్తస్రావం కావచ్చు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్‌ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!