NTV Telugu Site icon

Bank Account: చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుంచి నగదు విత్ డ్రా చేయడం ఎలా..?

Money Withdraw

Money Withdraw

మరణించిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి నగదు ఎలా తీసుకోవాలి అనేది చాలా మందికి తెలియదు. చనిపోయిన వ్యక్తి బంధువులైనా.. తోడ బుట్టిన వాళ్లయినా.. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా నగదును విత్ డ్రా చేస్తే చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మరణించిన వారి అకౌంట్ నుంచి డబ్బులు తీసేందుకు కొన్ని నిబంధనలు ఉంటాయి. వాటిని తప్పకుండా పాటించాల్సిందే. వారికి సంబంధించిన ఏటీఎం మీ దగ్గర ఉన్నా.. దానిని వాడ కూడాదు. ఒక వేళ వాడితే చిక్కుల్లోపడతారన్న విషయం తెలుసుకోవాలి. ఓ వ్యక్తి వృద్ధాప్యం వల్లనో లేక అనుకోని పరిస్థితుల్లో చనిపోయినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏటీఎం ద్వారా నగదు తీసుకుంటారు. కాని అకౌంట్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేసిన డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక తికమక పడుతుంటారు.

READ MORE:Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో భారీగా ఖాళీల భర్తీ.. పూర్తి వివరాలు ఇలా..

అప్పుడు ఏం చేయాలంటే ఆ వ్యక్తి అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు అధికారులను కలవాల్సి ఉంటుంది. సంబంధిత పత్రాలు తీసుకుని రమ్మని అధికారులు చెబుతారు. ఆ కుటుంబం అతని మరణ ధ్రువీకరణ పత్రంతో సహా సంబంధిత పత్రాలను బ్యాంకులో ఇచ్చి.. ఫిక్స్‌డ్ డిపాజిట్ డబ్బును పొందడానికి ప్రయత్నిస్తారు. ఫలానా వ్యక్తి మరణించిన తరువాత అతని నుండి డబ్బు విత్‌డ్రా అయ్యిందని తెలిస్తే అది పెద్ద సమస్య కూడా కొన్ని సందర్భాల్లో అవుతుంది. ఇది అనవసరమైన సమస్యలను నివారించడానికి ప్రవేశపెట్టిన పద్ధతి. అకౌంట్ తెరిచినప్పుడు ఒకరు లేదా ఇద్దరిని నామినీలుగా చేర్చుకోవడం జరుగుతుంది. వ్యక్తి మరణానంతరం మరణ ధ్రువీకరణ పత్రంతో పాటుగానామినీలు వారికి ఇచ్చిన కొన్ని సూచనలను పాటించాలి. నామినీలు వారి స్వంత కేవైసీ (KYC) విధానాలను పూర్తి చేయాలి. నామినీ ఐడీ, అడ్రస్ ప్రూఫ్ అన్ని సమర్పించాలి. నామినీ కేవలం డబ్బుకు సంరక్షకుడు మాత్రమే, డబ్బును మరణించిన వారి వారసులకు సమానంగా పంపిణీ చేయాలి. గందరగోళం ఏర్పడితే దానిని చట్టబద్ధంగా పరిష్కరించుకోవాలి. అదేవిధంగా ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతా తెరిచేటప్పుడు నామినీని పెట్టకపోయినా.. వారి మరణం తర్వాత చట్టబద్ధమైన వారసుల ధ్రువీకరణ పత్రాన్ని, మరణ ధృవీకరణ పత్రానికి జతచేయాలి. వారసులందరూ ఒప్పుకొన్న తర్వాతే మరణించిన వారి బ్యాంకు ఖాతాలోని డబ్బును ఉపయోగించవచ్చు.