NTV Telugu Site icon

Obesity : బరువు పెరగడానికి నిద్రకు ఇంతకు సంబంధం ఏమిటి ?

New Project (22)

New Project (22)

Obesity : జీవనశైలిలో మార్పుల కారణంగా బరువు పెరగడం సాధారణ సమస్యగా మారింది. అలాంటప్పుడు రకరకాల చిట్కాలు పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గకపోతే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో రాత్రి నిద్రపోయే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అందువల్ల బరువు వేగంగా తగ్గుతారు. జిమ్‌కు వెళ్లకుండానే బరువు తగ్గడంలో మీకు సహాయపడే విషయాలను తెలుసుకుందాం.

Read Also:Minister Karumuri Nageswara Rao: చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం..

మీరు రాత్రిపూట అదనంగా ఒక గంట నిద్రపోతే.. అది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సగానికి పైగా వ్యాధులు మన నిద్ర ద్వారానే చికిత్స పొందుతాయి. కాబట్టి మీరు తక్కువ నిద్రపోతున్నట్లయితే.. వెంటనే అలవాటును మార్చుకోండి. ప్రతిరోజూ కనీసం 9 గంటలు నిద్రపోయే అలవాటు చేసుకోండి.

Read Also:Nora Fatehi: అబ్బబ్బా ఏం పోజులు నోరా.. ఇలా చూస్తే కుర్రాళ్లు ఆగుతారా

పడుకునే ముందు ప్రోటీన్ షేక్ తాగడం వల్ల అనేక గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వు కంటే ఎక్కువ థర్మోజెనిక్ అని భావిస్తారు. అంటే మీ శరీరం దానిని జీర్ణం చేయడానికి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. పగటి పూట నిద్రించేవారిలో ఊబకాయం వచ్చే అవకాశం 21 శాతం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అలాంటప్పుడు పగటిపూట పడుకునే వారు స్లీప్ మాస్క్‌తో పడుకోవాలి.