Site icon NTV Telugu

Rahul Gandhi: ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

Rahul

Rahul

లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈరోజు వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజల ఫలితాలని మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇది ప్రజల విజయం. ఈ పోరాటం మోడీ వర్సెస్ పబ్లిక్ అని ఖర్గే పేర్కొన్నారు.

CPI Narayana: రాష్ట్ర, కేంద్ర ఎన్నికల ఫలితాలపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..

ఈ పోరాటం రాజ్యాంగాన్ని కాపాడేందుకే: రాహుల్ గాంధీ
మరోవైపు.. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత ప్రజలకు, ఇండియా కూటమి నేతలకు.. పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు. కూటమి కేవలం ఒక రాజకీయ పార్టీ కోసం పోరాడలేదని.. ప్రభుత్వ సంస్థలపై ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని తెలిపారు. ఈ ఎన్నికలు ఈడీ, సీబీఐకి వ్యతిరేకంగా జరిగాయని.. రాజ్యాంగ పరిరక్షణ కోసమే ఈ ఎన్నికలు జరిగాయన్నారు. దేశంలోని పేదలు, రైతులు, వెనుకబడిన వాళ్ళే రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ముందుకు వచ్చారని తెలిపారు. కాంగ్రెస్ మీతో ఉంటుంది.. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రయత్నం చేస్తామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

ప్రభుత్వ ఏర్పాటుపై రాహుల్ గాంధీ ఏం చెప్పారు?
ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానిపై మీరు ఏమనుకుంటున్నారు? అని అడిగిన ప్రశ్నకు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘మా కూటమి నేతలతో మాట్లాడి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంపై స్పందించారు. తమ వెనుక దాక్కున్న తన సోదరి కృషికి ఈ విజయమని తెలిపారు.

Amit Shah: 7 లక్షల ఓట్ల తేడాతో అమిత్ షా అఖండ విజయం..

ఇది ప్రజాస్వామ్య విజయం: ఖర్గే
18వ లోక్‌సభ ఎన్నికల ఫలితాలను వినమ్రంగా అంగీకరిస్తున్నామని ఖర్గే తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఈ ఆదేశం ప్రధాని మోడీకి వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. ఇది మోడీ నైతిక పరాజయం అని.. ఇది ప్రజాస్వామ్య విజయం అని తెలిపారు. మరోవైపు.. బీజేపీ ప్రభుత్వ యంత్రాంగం తమను అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందని.. తమ బ్యాంక్ ఖాతాలు కూడా సీజ్ చేశారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కబ్జా చేశారని.. ప్రత్యర్థి పార్టీలపై కక్ష్య పూరితంగా వ్యవహరించారని తెలిపారు. మరోవైపు.. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రలు తమకు చాలా కలిసి వచ్చాయని ఖర్గే పేర్కొన్నారు.

Exit mobile version