దాదాపు దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో ఫలితాలపై సీపీఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, డాక్టర్. కే. నారాయణ హాట్ కామెంట్ చేశారు. దేశం మొత్తం మీద మోడీ హవా కొనసాగుతుందని 400 పై చిలుకు సీట్లు సాధిస్తామని ధీమాతో ఉన్నవారికి దేశ ప్రజలు గట్టి గుణపాటాన్ని నేర్పించారన్నారు. ఒకవేళ పొరపాటున ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, ఎన్డీఏ ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి కళ్లెం వేసేంత స్థాయిలో సీట్లు సాధించడం ఆనందదాయకం అన్నారు. ఇది ఒక రకంగా ఇండియా కూటమి యొక్క నైతిక విజయమని, ఎన్డీఏ కూటమి యొక్క అపజయంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలపై మాట్లాడిన నారాయణ దేశంలో అత్యథికంగా సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వమే అందిస్తుందన్న విర్రవీగిన వైసీపీకి గతంలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన 23 సీట్ల కన్నా తక్కువ సంఖ్యలో 16 సీట్లకే పరిమిత కావడం జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రత్వ పోకడ, అహంకార వైఖరికి నిదర్శనం అన్నారు.
READ MORE: Axis My India Exit Poll : ఎగ్జిట్ పోల్స్ విఫలమవ్వడంతో టీవీ షో మధ్యలో ఏడ్చిన సంస్థ ఎండీ
151 సీట్లు అందించిన రాష్ట్ర ప్రజల మేలు కన్నా కక్ష సాధింపు రాజకీయాల మీద దృష్టి సారించి రాజకీయ వ్యవస్థని అస్తవ్యస్తం చేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీకి తాను అభినందనలు తెలుపుతున్నట్లు, అలాగే ఈ రాజకీయవ్యవహారం లో క్రిస్టల్ పాత్రవహించిన పవర్స్టార్ పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేశాక గతంలో చేసిన తప్పిదాలు చేయకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి లాగా వ్యవహరించకుండా ప్రజా సమస్యల మీద అమరావతి రాజధాని , పోలవరం , సాధనలో ముఖ్యపాత్ర వహించస్తారని అశిస్తునన్నారు.
READ MORE: Stock Market: హరోంహర.. ఒక్కరోజులో రూ. 30 లక్షల కోట్ల సంపద ఆవిరి..
తెలంగాణ ఎన్నికల ఫలితాలుపై కూడా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తమిళనాడు తరహాలో డీఎంకే పార్టీల మిగతా అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని తగు వ్యూహరచనలతో ముందుకెళ్లి ఉంటే తమిళనాడు తరహాలోనే తెలంగాణలో కూడా విజయం సాధించేదన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ తమ సొంత నిర్ణయాలు కన్నా కూటమి పార్టీల అభిప్రాయాలను సేకరించి వారిని కూడా కలుపుకొని ఎన్నికలు కు వెళ్లి ఉంటే మరిన్ని విజయాలు కాంగ్రెస్ సాధించి ఉండేదని అభిప్రాయపడ్డారు.