NTV Telugu Site icon

Yuzvendra Chahal-Mahvash: వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్.. మహ్‌వశ్‌ పోస్ట్‌ వైరల్‌!

Yuzvendra Chahal Mahvash

Yuzvendra Chahal Mahvash

ఐపీఎల్ 2025లో భాగంగా మంగళవారం కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ సంచలన విజయం సాధించింది. కోల్‌కతాను 95కే ఆలౌట్ చేసి 16 పరుగుల తేడాతో రికార్డు విక్టరీ ఖాతాలో వేసుకుంది. పంజాబ్‌ విజయంలో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌ కీలక పాత్ర పోషించాడు. చహల్‌ తన స్పిన్‌ మాయాజాలంతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. తన 4 ఓవర్ల కోటాలో నాలుగు వికెట్లు పడగొట్టి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అద్భుతంగా బౌలింగ్ చేసిన యూజీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే చహల్‌తో డేటింగ్‌ వార్తల వేళ రేడియో జాకీ మహ్‌వశ్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది.

పంజాబ్‌, కోల్‌కతా మ్యాచ్‌ అనంతరం యుజ్వేంద్ర చహల్‌ను ప్రశంసిస్తూ మహ్‌వశ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో ఓ పోస్ట్‌ చేశారు. వాట్ ఏ టాలెంటెడ్ మ్యాన్ అంటూ.. యూజీతో కలిసి దిగిన సెల్ఫీని షేర్‌ చేశారు. ‘నీ టాలెంట్‌ అద్భుతం. అందుకే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందావు. అసంభవ్’ అంటూ మహ్‌వశ్‌ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ను చహల్‌, మహ్‌వశ్‌ కలిసి చూడగా.. వీరు ప్రేమలో ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. అయ్యితే ఈ వార్తలను వీరిద్దరూ ఖండించారు. ఐపీఎల్ 2025లో చహల్‌ ఆడుతున్న మ్యాచ్‌లకు మహ్‌వశ్‌ వచ్చి సందడి చేస్తున్నారు.