పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు ముందు ఆమె అనర్హతకు వ్యతిరేకంగా భారత రెజ్లర్ వినేష్ ఫోగాట్ చేసిన అప్పీల్‌పై నిర్ణయాన్ని కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ అడ్ హాక్ డివిజన్ మంగళవారం ఆగస్టు 16కి వాయిదా వేసింది. మంగళవారం వినేష్ ఫోగట్ రజత పతకం అందుకుంటాందా లేదా అనే దానిపై తీర్పు ఇవ్వాల్సి ఉంది.. కానీ ఇప్పటి వరకూ మూడుసార్లు నిర్ణయం వాయిదా పడింది. దీంతో వినేశ్ తో పాటు.. భారతవని మొత్తం ఎదురుచూచ్తుంది. అయితే.. రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హతపై నిర్ణయం ఆలస్యం కావడంపై భారత రెజ్లింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ జై ప్రకాష్ చౌదరి స్పందించారు. వినేశ్కు అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పారు. కొంత మంది శక్తివంతమైన వ్యక్తులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.. ఆమెకు పతకం ఖచ్చితంగా వస్తుందన్నారు. అయితే.. వినేశ్ ఫైనల్ కు ముందు బరువు పెరగడం ఆమె సిబ్బంది తప్పు అని అన్నారు. ఏదేమైనప్పటికీ.. ఆగస్ట్ 16న ఏం జరుగుతుందో చూద్దాం… మనకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ విచారణ మొదలు.. కీలకంగా 6 అంశాలు..
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. “వినేష్ ఫోగాట్ వర్సెస్ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కేసులో తన నిర్ణయాన్ని అందించడానికి ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ యొక్క అడ్ హాక్ డివిజన్ ప్రెసిడెంట్ అన్నాబెల్లె బెన్నెట్‌ను నియమించారు. 2024 ఆగస్టు 16 వ తేదీ శుక్రవారం పారిస్ కాలమానం ప్రకారం.” సాయంత్రం 6 గంటల వరకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటల వరకు) నిర్ణయం వెల్లడించనుంది.
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం.. అసలేమైందంటే?
మూడు విజయాలతో మహిళల 50 కిలోల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న వినేష్.. ఉదయం వెయిల్-ఇన్‌లో విఫలమైనందున ఆమె స్వర్ణ పతక విజేత యునైటెడ్ స్టేట్స్‌కు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో టైటిల్ పోరుకు దూరమైంది. ఆ సమయంలో ఆమె బరువు నిర్ణీత పరిమితి కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో.. రెజ్లర్ వినేశ్ ఫోగట్ గత బుధవారం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది. క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిసి ఆమెకు ఉమ్మడి రజత పతకాన్ని ఇవ్వాలని డిమాండ్ చేసింది. లోపెజ్ సెమీ-ఫైనల్స్‌లో వినేష్ చేతిలో ఓడిపోయింది. అయితే భారత రెజ్లర్ అనర్హతతో లోపెజ్ ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. కాగా.. వినేశ్ పై అనర్హత వేటు వేసిన ఒక రోజు తర్వాత రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ క్రమంలో.. వినేశ్ కు ప్రపంచవ్యాప్తంగా పలువురు మద్దతు పలుకుతున్నారు.