Site icon NTV Telugu

Russia: ఆ ఆయుధాల వల్ల ఉక్రేనియన్లకే డేంజర్… రష్యా హెచ్చరిక

Russia

Russia

Russia on Western Arms: కొన్ని నెలలుగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌కు పలు దేశాలు ఆయుధాలు సరఫరాతో పాటు ఆర్థికంగా సహాయం అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా స్పందించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్, ఇతర పాశ్చాత్య దేశాల చర్యలు, తేలికపాటి ట్యాంకులు ఉక్రేనియన్ల జీవితాన్ని మరింత కష్టతరం చేస్తాయని క్రెమ్లిన్ సోమవారం పేర్కొంది.

ఈ ఆయుధాల సరఫరా దేనిని మార్చలేవని, మార్చవు.. ఉక్రెయిన్ ప్రజల బాధలను మాత్రమే పొడిగించగలవు అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ గత వారం ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులను పంపాలని ఫ్రాన్స్ తీసుకున్న నిర్ణయంపై ఒక ప్రశ్నకు సమాధానంగా విలేకరులతో అన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గత వారం కైవ్‌కు తేలికపాటి ట్యాంకులను పంపుతామని ప్రతిజ్ఞ చేశారు.

Dawood Ibrahim: గుట్కా యూనిట్‌ ఏర్పాటుకు దావూద్ ఇబ్రహీంకు సాయం.. వ్యాపారికి జైలు శిక్ష

ఫ్రాన్స్ తయారు చేసిన ఏఎంఎక్స్-10 ఆర్సీని ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు ఆ దేశం నిర్ణయం తీసుకుంది. 1980ల నుంచి వాడకంలో ఉన్న తేలికపాటి యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు పంపిన మొదటి పాశ్చాత్య దేశంగా ఫ్రాన్స్‌ నిలవనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంప్రదింపులు జరుపుతున్నట్లు క్రెమ్లిన్ తెలిపింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కీవ్‌కు ట్యాంకులను పంపడానికి కట్టుబడి ఉన్న తర్వాత.. జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ కూడా ట్యాంకులను పంపడానికి ముందుకొచ్చారు.

Exit mobile version